CM Revanth Reddy: పెట్టుబడంటే తెలంగాణే..
ABN, Publish Date - Jan 14 , 2025 | 02:55 AM
‘‘పెట్టుబడులంటేనే తెలంగాణ అనేలా ఉండాలి. అందుకు తగ్గట్లుగా మన ప్రణాళికలను రూపొందించాలి. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇప్పటికే దేశంలో అందరి దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోంది.
అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలి
పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రానికి పేరు.. దావో్‌సలో మరిన్ని కంపెనీలను ఆకర్షించాలి
పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి.. నిరుటి దావోస్ ఒప్పందాల కార్యరూపంపై సంతృప్తి
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ‘‘పెట్టుబడులంటేనే తెలంగాణ అనేలా ఉండాలి. అందుకు తగ్గట్లుగా మన ప్రణాళికలను రూపొందించాలి. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇప్పటికే దేశంలో అందరి దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోంది. విదేశీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉంది. దావోస్ పర్యటన సందర్భంగా.. ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎ్‌ఫ)లో మరిన్ని కంపెనీలను ఆకర్షించాలి’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 20 నుంచి దావోస్‌లో జరగనున్న డబ్ల్యూఈఎ్‌ఫకు ఆయన వెళ్లనున్నారు. అంతకంటే ముందు సింగపూర్‌లో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో.. గత ఏడాది దావో్‌సలో జరిగిన డబ్ల్యూఈఎఫ్‌లో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి పురోగతిపై సోమవారం తన నివాసంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులతో సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గత ఏడాది దావోస్ ఒప్పందాల మేరకు ప్రాజెక్టులు ఏయే దశల్లో ఉన్నాయి? ఎన్ని ప్రారంభమయ్యాయి? అనే వివరాలను సీఎం రేవంత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోందన్నారు. ‘‘ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలో జరిగిన అభివృద్ధి పనులు తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయి. తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది దావోస్ డబ్ల్యూఈఎ్‌ఫలో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అధికారులు సీఎంకు ఆయా ప్రాజెక్టుల పురోగతిపై వివరణ ఇచ్చారు. 14 ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయని తెలిపారు. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయని, వీటిలో 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వివరించారు. పది ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఏడు ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబుతో ఆయా కంపెనీల వారీగా పురోగతిని సీఎం చర్చించారు.
విదేశాల్లో సుడిగాలి పర్యటనలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావో్‌సలో పర్యటించనున్నారు. ఆయన వెంట మంత్రి శ్రీధర్‌బాబు ఉంటారు. సింగపూర్‌లో స్కిల్ యానివర్సిటీతో ఒప్పందాలు చేసుకుంటారు. దాంతోపాటు.. పలు సంస్థలతో పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతారు. దావో్‌సలో జరగనున్న డబ్ల్యూఈఎఫ్ సందర్భంగా ప్రవాస భారతీయులతో భేటీకానున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రణాళికలను రూపొందించినట్లు తెలుస్తోంది.
Updated Date - Jan 14 , 2025 | 02:56 AM