Seethakka: ఘనంగా సీఎం మనవడి బర్త్‌డే
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:37 AM
శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, ఆయన సతీమణి గీతారెడ్డి, ఇతర కుటుంబసభ్యులతోపాటు సన్నిహితులు, పలువురు మంత్రులు మాత్రమే పాల్గొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనవడు రుద్ర పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, ఆయన సతీమణి గీతారెడ్డి, ఇతర కుటుంబసభ్యులతోపాటు సన్నిహితులు, పలువురు మంత్రులు మాత్రమే పాల్గొన్నారు. మంత్రి సీతక్క వేడుకలో పాల్గొని రుద్రకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సీఎం సతీమణి గీతారెడ్డి, మనవడు రుద్రతో మంత్రి సీతక్క కలిసి ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.