Share News

Hyderabad: నేడు కాంగ్రెస్‌ ధర్నా

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:12 AM

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా ఆదివారం ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది.

Hyderabad: నేడు కాంగ్రెస్‌ ధర్నా

  • బడ్జెట్లో వివక్షకు వ్యతిరేకంగా నిరసన

  • రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా ఆదివారం ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రకటించారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


ఇందులో భాగంగా స్థానిక అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల నేతలు తదితరులు పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రధాని, ఆర్థిక, ఇతర కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలన్నారు.

Updated Date - Feb 02 , 2025 | 04:12 AM