Sangareddy: కాళ్లు కట్టేసి.. మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జి పైనుంచి కుక్కల పడవేత
ABN, Publish Date - Jan 10 , 2025 | 07:16 AM
మానవత్వం మంటగలిసింది. మూగ జీవాలపై ప్రేమను చూపాల్సిందిపోయి కర్కషంగా వ్యవహరించారు. కుక్కల కాళ్లు కట్టేసి.. మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జి పైనుంచి కిందకు పడేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎద్దుమైలారం శివారులో జరిగింది.
- 20 శునకాలు మృతి..
- 11 కుక్కలకు తీవ్రగాయాలు
కంది(సంగారెడ్డి): మానవత్వం మంటగలిసింది. మూగ జీవాలపై ప్రేమను చూపాల్సిందిపోయి కర్కషంగా వ్యవహరించారు. కుక్కల కాళ్లు కట్టేసి.. మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జి పైనుంచి కిందకు పడేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎద్దుమైలారం శివారులో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి ఇంద్రకరణ్ ఎస్సై విజయ్ కుమార్(Indrakaran SI Vijay Kumar) తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Sankranti festival: చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
ఈనెల 4వ తేదీన ఎద్దుమైలారం శివారులోని ఓ బ్రిడ్జి నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 31 వీధి కుక్కలకు కాళ్లు కట్టేసి, మూతులు కుట్టేసి నలభై అడుగుల ఎత్తులోని బ్రిడ్జి పై నుంచి పడేశారు. అందులో 20 కుక్కలు చనిపోయాయి. మరో 11 కుక్కలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్లిన కొందరు బ్రిడ్జి కింద కుక్కలను చూసి జంతు ప్రేమికులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు గాయపడిన కుక్కలను హైదరాబాద్(Hyderabad)లోని నాగోల్‌లో ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనంతరం ఈనెల 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలని ఎవరైనా శునకాలను బ్రిడ్జిపై నుంచి విసిరేశారా.. లేక వాటిని చంపి పడేశారా అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. చనిపోయిన 20 కుక్కల అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్ఎల్)కి పంపినట్లు తెలిపారు. జంతుప్రేమికుల ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జంతు ప్రేమికులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు
ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్’ యాప్
ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?
ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్
Read Latest Telangana News and National News
Updated Date - Jan 10 , 2025 | 07:28 AM