Share News

Farmer Suicide: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:59 AM

ఆర్థిక ఇబ్బందుల కారణంగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని చిన్న శంకర్‌పల్లిలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కుమారుడు చేసిన అప్పులతో గొడవ పడ్డ హన్మంత్‌రెడ్డి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు

Farmer Suicide: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా చిన్న శంకర్‌పల్లిలో ఘటన

శంకర్‌పల్లి, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని చిన్న శంకర్‌పల్లిలో జరిగింది. బద్దం హన్మంత్‌రెడ్డి(48) వ్యవసాయం చేసుకొని జీవనం సాగించేవాడు. అతనికి భార్య అనిత, కుమారులు అరవింద్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి ఉన్నారు. అయితే పెద్ద కుమారుడు అరవింద్‌రెడ్డి తల్లిదండ్రులకు చెప్పకుండా బయట రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. ఇదే విషయంలో భార్య, పెద్ద కుమారుడితో హన్మంత్‌రెడ్డి గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో మనస్తాపంతో ఈనెల 3న పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం హన్మంత్‌రెడ్డి పొలంలో మృతి చెంది ఉండటాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Updated Date - Apr 07 , 2025 | 04:59 AM