Gukesh : శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రచారకర్తగా గుకేష్
ABN , Publish Date - Apr 13 , 2025 | 05:25 AM
భారత చెస్ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ చాంపియన్ గుకేష్ దొమ్మరాజును తమ విద్యాసంస్థల ప్రచారకర్త(బ్రాండ్ అంబాసిడర్)గా నియమించామని శ్రీచైతన్య విద్యాసంస్థ తెలిపింది.

హైదరాబాద్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): భారత చెస్ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ చెస్ చాంపియన్ గుకేష్ దొమ్మరాజును తమ విద్యాసంస్థల ప్రచారకర్త(బ్రాండ్ అంబాసిడర్)గా నియమించామని శ్రీచైతన్య విద్యాసంస్థ తెలిపింది. చిన్న వయస్సులోనే గుకేష్ సాధించిన అసాధారణ విజయాలు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని శ్రీచైతన్య విద్యాసంస్థల సీఈవో సుష్మ బొప్పన ఒక ప్రకటనలో తెలిపారు.
గుకేష్ ప్రేరణతో తమ విద్యార్థులు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై గుకేష్ దొమ్మరాజు సంతోషం వ్యక్తం చేశారు. చదరంగంలో విజయానికి ముందస్తు ప్రణాళిక, వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణ ఎంతో కీలకమని, పోటీ పరీక్షలకూ ఇదే విధానం అవసరమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.