Share News

హెచ్‌సీయూ భూముల వేలం ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:37 PM

హైదరాబా దు సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకాన్ని వెంటనే ఉపసంహ రించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్‌ చేశారు.

హెచ్‌సీయూ భూముల వేలం ఉపసంహరించుకోవాలి
జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు

- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ కొల్లాపూర్‌/ పెంట్లవెల్లి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : హైదరాబా దు సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల అమ్మకాన్ని వెంటనే ఉపసంహ రించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్‌ చేశారు. బుధవారం సీపీ ఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. అలాగే కొల్లాపూర్‌లో సీపీఎం మండల కార్యదర్శి శివ వర్మ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చౌర స్తాలో, పెంట్ల వెల్లిలో సీపీఎం జిల్లా నాయకుడు ఈశ్వర్‌ ఆధ్వ ర్యంలో పాత బస్టాండ్‌ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కొల్లాపూర్‌లో పర్వతాలు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్ర భుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కోసం విలువైన భూములను అమ్మడం దుర్మా ర్గమైన చర్యయని పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూము లను కాపాడేందుకు ఉద్యమిస్తున్న ఎస్‌ ఎఫ్‌ఐ నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు ఆర్‌.శ్రీనివాస్‌, కె.గీత, రామయ్య, అశోక్‌, మధు, గోవింద్‌, రవి, మల్లయ్య, బత్తిని రాము, వంశీ, కొల్లాపూర్‌లో సీపీఎం నాయకులు ఎండి సలీం, బాలపీర్‌, బత్తిని రాజు, నెనావత్‌ బాలు నాయక్‌, శివ శంకర వరప్రసాద్‌, కార్తీక్‌, బంకల సతీష్‌, పెంట్లవెల్లిలో సీపీఎం నాయకులు తిమ్మస్వామి, నరసింహ, అబ్దుల్లా, పెంటయ్య, లక్ష్మ్మీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 11:37 PM