ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG NEWS: బాబోయ్ హైదరాబాద్‌లో మళ్లీ చిరుత.. ఎక్కడంటే

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:08 PM

Telangana: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో చిరుత కదలికలు కనిపించాయి. చిరుత కనపడటంతో మార్నింగ్ వాకర్ష్, స్థానికులు తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో చిరుత పులి కలకలం సృష్టించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతను మార్నింగ్ వాకర్స్ ఇవాళ(ఆదివారం) ఉదయం చూశారు. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు చిరుత వచ్చింది. అక్కడి నుంచి చెట్లలోకి చిరుత వెళ్లిపోయింది. చిరుత పాదాలను మార్నింగ్ వాకర్స్ గుర్తించారు. ఈరోజు తెల్లవారుజామున ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుత కదలికలు కనిపించాయని మార్నింగ్ వాకర్స్ చెప్పారు.


అక్కడి నుంచి చెట్ల పొదల్లోకి వెళ్తూ నీటి సంపులో నీరు తాగింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి ఫారెస్ట్ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. చిరుత పులి పాదాలు గుర్తించి వాటి ఆధారాలను సేకరిస్తున్నారు. తెల్లవారుజామున 5:30 గంటలకు చిరుతపులిని చూశానని ఏబీఎన్‌తో ప్రత్యక్ష సాక్షి(మార్నింగ్ వాకర్) వెంకటేష్ తెలిపారు.


ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో తాను డైలీ వాకింగ్‌కు వస్తానని చెప్పారు. చిరుత పులిని చూసిన వెంటనే భయంతో యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చానని అన్నారు. ఈరోజు ఫారెస్ట్ అధికారులు పోలీసులు వచ్చారన్నారు. తనకు చిరుత కనిపించిన ప్రాంతాన్ని చూపించానని అన్నారు. ఫారెస్ట్ అధికారులు చిరుత వేలిముద్రలు పరిశీలించారని.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు. అది నిజంగా చిరుత పులి అయితే ట్రాప్ కెమెరాలు పెట్టి బోన్లు ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారని అన్నారు. చిరుత కదలికలపై నిఘా పెట్టారని... స్థానికంగా ఉండేవారిని అధికారులు అప్రమత్తం చేశారని తెలిపారు.

Updated Date - Jan 12 , 2025 | 03:14 PM