Share News

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Apr 14 , 2025 | 09:46 AM

Falaknuma Crime News: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫలక్‌నుమా రౌడీషీటర్‌ను దుండగులు అత్యంత విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే
Falaknuma Crime News

హైదరాబాద్, ఏప్రిల్ 14: అతనో రౌడీషీటర్. తన మాటలతో, చేష్టలతో అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తుంటాడు. ప్రజల్లో అతడంటే ఒక హడల్. ఫలక్‌నుమాలో అతడి పేరు చెబితే వ్యాపారులు, ప్రజలు కూడా వణికిపోయే పరిస్థితి. ఎవరైనా ఎంతకాలం తమ ఆటలు సాగిస్తారు. ఎప్పుడో ఒకప్పుడు రౌడీయిజానికే బలికాక తప్పదు కదా. ఇప్పుడు ఫలక్‌నుమా రౌడీషీటర్ పరిస్థితి కూడా అదే. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రౌడీషటర్‌‌కు మూడు రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇంతలోనే దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.


ఫలక్నుమా రౌడీషీటర్ మాస్ యుద్ధీన్ దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్బజార్లో మాస్ యుద్ధీన్ను దుండగులు కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపారు. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మాస్ యుద్ధీన్ అక్కడిక్కడే మృతి చెందాడు. నడిరోడ్డుపై ఓ వ్యక్తి కత్తిపోట్లతో ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని వ్యక్తిని పరిశీలించగా.. అతడు రౌడీషీటర్ మాస్ యుద్ధీన్‌గా గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


అలాగే రౌడీషీటర్ మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రత్యర్థులే యుద్ధీన్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే యుద్ధీన్‌కు మూడు రోజుల క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు.


ఇవి కూడా చదవండి

Ambedkar Jayanti: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: సీఎం చంద్రబాబు

Monday Tips: సోమవారం ఈ పరిహారాలు చేస్తే చంద్ర దోషం నుండి విముక్తి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 09:47 AM