Rythu Bharosa: రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల
ABN, Publish Date - Jan 12 , 2025 | 09:48 AM
Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్నయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇవాళ విడుదల చేసింది.
హైదరాబాద్: రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12వేలు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. భూభారతి (ధరణి) పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగించింది. ROFR పట్టాదారులు కూడా రైతుభరోసాకు అర్హులు అని ప్రకటించింది. RBI నిర్వహించే DBT పద్ధతిలో రైతుభరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది రైతుభరోసా పథకం వ్యవసాయశాఖ సంచాలకులు ద్వారా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. NIC, IT భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపింది. జిల్లా కలెక్టర్లకు పథకం అమలు ఫిర్యాదుల పరిష్కరణ బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయశాఖ సంచాలకుల తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Updated Date - Jan 12 , 2025 | 09:55 AM