Share News

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్..

ABN , Publish Date - Feb 26 , 2025 | 09:55 AM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే.. సీఎం ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని ఆరోపించారు.

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్..
BRS Leader KTR

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President ), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా కామెంట్స్ (Comments) చేశారు. 36 సార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తెచ్చింది లేదని, ఎస్ఎల్‌బీసీ (SLBC) సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే.. సీఎం ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని విమర్శించారు. మూడు నెలలుగా జీతాల్లేక అల్లాడుతున్నామని కార్మికులు వాపోతుంటే.. ఎన్నికల ప్రచారం ముగించుకుని నిమ్మలంగా మళ్లీ హస్తిన బాటపట్టారని దుయ్యబట్టారు.

ఈ వార్త కూడా చదవండి..

వల్లభనేని వంశీకి పోలీసుల షాక్..


సొరంగంలో సహాయక చర్యలు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదని... వందడుగులు వెనక్కి అన్నట్లుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అక్కడ ఆక్సిజన్ లేదని, కన్వేయర్ బెల్టు తెగిపోయిందని, ఘటన జరిగి 96 గంటలు దాటినా ఒక్క అదుగు కూడా ముందుకు పడడం లేదని విమర్శించారు. కాళేశ్వరం పర్రెల మీద.. శ్రీశైలం అగ్నిప్రమాదం మీద కారుకూతలు కూసి, విషపు రాతలు రాసిన మేధావుల నోళ్లు ఎస్ఎల్‌బీసీ విషయంలో మాత్రం నోరెత్తడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన యాత్రలు మాని ఆ కార్మికుల గోడు వినాలని కేటీఆర్ సూచించారు. ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. అక్కడ చిక్కుకున్నవి సాధారణ ప్రాణాలు కాదని.. ఈ జాతి సంపద అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


ఎస్ఎల్‌బీసీ ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ వేయాలి..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఒకవైపు సహాయక చర్యలు మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదంపై, అందుకు బాధ్యులైన వారిపైనా విచారణ చేపట్టాలని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి వందలకోట్ల నష్టం జరిగిందన్నారు. ఇంతకుముందు సుంకిశాల, పెద్దవాగు ప్రమాదాలు జరిగినపుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

కడియం శ్రీహరికి కేటీఆర్‌ సవాల్‌..

మరోవైపు.. దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలిచి చూపించాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు మాజీ జడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నుంచి వలసలు మొదలయ్యాయని, ఇందుకు స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరికలే సాక్ష్యమని చెప్పారు. రేవంత్‌రెడ్డి చేతకానితనం వల్ల 48 గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ మరణ మృదంగానికి ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత అని ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శివరాత్రి శుభాకాంక్షలు: సిఎం చంద్రబాబు

తెలంగాణలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

తెలీదు.. మరిచిపోయా.. గుర్తులేదు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 26 , 2025 | 09:55 AM