Minister Ponnam Prabhakar: అలా చేస్తే కఠిన చర్యలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాస్ వార్నింగ్
ABN, Publish Date - Jan 03 , 2025 | 04:12 PM
Minister Ponnam Prabhakar: ప్రతి పాఠశాలలో యునిసెఫ్ సహకారంతో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం 500 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. చిన్నతనం నుంచే ట్రాఫిక్‌పై అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రబాకర్ చెప్పారు.
హైదరాబాద్ : రోడ్డు నిబంధనలు ఉల్లగించిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. రోడ్డు రవాణా , ఆర్టీసీ, భవనాలు రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ పాయింట్లను గుర్తించి తొలగిస్తామని చెప్పారు. ఈ నెల 7 వ తేదీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో భేటీ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో రోడ్డు భద్రతపై చర్చిస్తామని అన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పై ఆవేర్నెస్ కల్పిస్తామని అన్నారు. భాగ్యనగరంలో అనేక జంక్షన్‌లు వస్తున్నాయని.. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ ఒక ముగ్గరికి అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతాపై రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
రహదారి భద్రతా పోస్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. రవాణా శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, విశ్వ ప్రసాద్ అడిషనల్ సీపీ ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయని చెప్పారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, ప్రమాదాలు నివారించాలని ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. తెలంగాణలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ రవాణా శాఖ, పోలీస్ శాఖ , విద్యా శాఖ అన్ని రకాల డిపార్ట్మెంట్‌లు ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రవాణా శాఖ పక్షాన కోరామన్నారు. రోడ్డు భద్రతపై ఎవరికి వారు అవగాహనతో అమలు చేయాలని చెప్పారు.
ప్రజలు చైతన్యం కావాలని.. సామాజికంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలో యునిసెఫ్ సహకారంతో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సంవత్సరం 500 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ లు ఏర్పాటు చేస్తామన్నారు. చిన్నతనం నుంచే ట్రాఫిక్‌పై అవగాహన కల్పించాలని చెప్పారు. ఏ కార్యక్రమం అయినా చిన్నప్పుడు నేర్చుకున్నది పెద్దయిన తర్వాత ఉపయోగపడుతుందని అన్నారు. ట్రాఫిక్ రూల్స్‌పై సిలబస్‌లో మరింతంగా ఫోకస్ పెట్టేలా క్యాబినెట్‌లో మాట్లాడతామని తెలిపారు. బయటకు వెళ్లినప్పుడు బాధితులతో ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
MLC Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్..
Bhatti Vikramarka: ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది: డిప్యూటీ సీఎం భట్టి..
TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 03 , 2025 | 04:13 PM