ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: స్పోర్ట్స్ యూనివర్సిటీపై రేవంత్ కీలక ప్రకటన

ABN, Publish Date - Jan 12 , 2025 | 02:41 PM

CM Revanth Reddy: తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రపంచంతో పోటీపడాలని అన్నారు. తెలంగాణకు ఏపీ, అమరావతితో పోటీ కాదని చెప్పారు. తమిళనాడు, కర్ణాటకాకు మెట్రో రైలు ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

CM Revanth Reddy:

హైదరాబాద్: త్వరలో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 35 ఏళ్ల విద్యార్థి దశ నుంచి సీఎం స్థాయి వరకు ఉన్న పెద్దలను కలవడానికి ఈ వేదిక ఉపయోగపడిందని అన్నారు. విద్యాసాగర్‌ రావు రాసిన ఉనిక పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్‌లో ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. నేడు యూనివర్సిటీలు ఉనికి కోల్పోయే విధంగా ఉన్నాయన్నారు. తాను సీఎం అయ్యాక యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించామని తెలిపారు. యూనివర్సిటీలకు తిరిగి పూర్వ వైభవం రావాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కారణమని అన్నారు. విద్యార్థి దశలో చైతన్యం లేకపోవడంతోనే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు.విద్యార్థి రాజకీయాల్లో సిద్ధాంత పరమైన రాజకీయాలు లోపించాయని అన్నారు. విద్యార్థి రాజకీయాలను తెలంగాణలో ప్రోత్సహించాలన్నారు.


విద్యార్థి రాజకీయాలు లేకపోతే చైతన్యం కోల్పోతామని చెప్పారు. అసెంబ్లీలో సీఎంకు ఎంత సమయం మైక్ ఇస్తారో ప్రధాన ప్రతిపక్ష నేతకు అంతే సమయం మైక్ ఇస్తారని తెలిపారు. ప్రభుత్వం అంటే పాలకపక్షం,ప్రతిపక్షం కలిసి ఉంటాయని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ ప్రాతినిధ్యం చాలా తక్కువ కానీ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విషయాలు లేవనెత్తారని గుర్తుచేశారు. కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారని అన్నారు. అసెంబ్లీ వాయిదా పడితే పాలక పక్షం, ప్రతిపక్షం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే వాళ్లమన్నారు. తాను సీఎం అయ్యాక 13 నెలల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలనుసభలో నుంచి బహిష్కరించలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు కట్టారన్నారు.ఎన్నికలప్పుడే రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని చెప్పారు.హైదరాబాద్ విశ్వనగరంలా మారాలంటే రీజినల్ రింగ్ రోడ్డు కావాలని చెప్పారు. హైదరాబాద్‌కు రీజినల్ రింగ్ రైల్ కావాలని మోదీనిఅడిగానని గుర్తుచేశారు. ఆటో మొబైల్ ఇండ్రస్ట్రీని తెలంగాణకు తీసుకు రావాలని తాము అనుకుంటున్నామన్నారు.


‘‘తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలి. తెలంగాణకు ఏపీ,అమరావతితో పోటీ కాదు. తమిళనాడు,కర్ణాటకలో మెట్రో రైలుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణకు మెట్రో అనుమతులు కేంద్రం ఇవ్వాలి. సమస్య వస్తే తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటి అవుతాయి. తెలంగాణలో అదే సంప్రదాయం ఉండాలి. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. యూనివర్సిటీ నడవడానికి రూ. 600 కోట్ల కార్ఫస్ ఫండ్ పెట్టాము. సి.ఎస్.ఆర్ ఫండ్స్ తో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చేస్తున్నాం. సౌత్ కొరియాకు 33 ఒలింపిక్ పతకాలు వచ్చాయి. స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి సౌత్ కొరియాలో 16 పతకాలు వచ్చాయి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Jan 12 , 2025 | 02:43 PM