Sankranti CelebrationS 2025: నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో సందడిగా సంక్రాంతి సంబురాలు
ABN, Publish Date - Jan 14 , 2025 | 11:58 AM
Sankranti CelebrationS 2025: భాగ్యనగరంలో సంకాంత్రి వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కైట్ ఫెస్టివల్‌ను భోగి పండుగ రోజు ప్రారంభించారు. మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్ జరుగనుంది.
హైదరాబాద్: భాగ్యనగరంలో సంకాంత్రి వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కైట్ ఫెస్టివల్‌ను భోగి పండుగ రోజు ప్రారంభించారు. మూడు రోజుల పాటు కైట్ ఫెస్టివల్ జరుగనుంది. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాసు యాదవ్ పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నారులతో కలిసి పతంగులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల గీతాలు ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ కళాకారుల ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది.కైట్ ఫెస్టివల్‌ను చూడటానికి జనం భారీగా తరలి వస్తున్నారు.
సందడిగా కైట్స్, స్వీట్ ఫెస్టివల్
పెరేడ్ గ్రౌండ్స్‌లో రెండో రోజు ఇంటర్నేషనల్ కైట్స్, స్వీట్ ఫెస్టివల్ సందడిగా జరిగింది. దేశ విదేశాల పతంగులు ఆకట్టుకుంటున్నాయి. భారీ పతంగులను ఇంటర్నేషనల్ కైట్ ప్లయర్స్ ఎగరవేస్తున్నారు. స్వీట్ ఫెస్టివల్‌లో130 రకాల దేశీయ స్వీట్స్ నోరూరిస్తున్నాయి. స్వీట్ ఫెస్టివల్‌లో 200లకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ ఒక్క రోజే లక్ష మందికి పైగా సందర్శించే అవకాశం ఉంది.
పండుగను సంతోషంగా చేసుకోవాలి: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలుగు రాష్ట్రాల్లో బోగీ, సంక్రాంతి, కనుమ సంతోషంగా నిర్వహించుకునే పండగ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఏబీఎన్‌తో తలసాని మాట్లాడుతూ..మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సంబురాలు చేసుకునే పండగ ఇదని చెప్పారు. రాష్ట్రంలో రైతాంగానికి, ప్రజలకు పవిత్రమైన పండగ ధాన్యరాసులతో కలకాలడేటువంటి పండగ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రామీణ ప్రాంతం నుంచి పట్నం వరకు వైభవంగా చేసుకుంటారని పండగ అని చెప్పారు. ఏ బస్తీల్లో చూసిన చిన్న, పెద్ద అని తేడా లేకుండా పాల్గొంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పండగలు ఎక్కడా ఉండవని చెప్పారు. మన పండగల గురించి పిల్లలకు వివరించాలని తెలిపారు. అల్లుళ్లతో సరదాగా పాలుపంచుకునే పండగ ఇదని అన్నారు. అందరూ సుఖసంతోషాలతో చేసుకోవాలని కోరుకున్నారు. పండగ పూట ఎమ్మెల్యే కౌషిక్‌రెడ్డిని అరెస్టు చేయడం సరికాకాని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Updated Date - Jan 14 , 2025 | 01:13 PM