Share News

Missing Case: సికింద్రాబాద్‌లో మిస్టరీగా ఒకే కుటుంబంలో ఆరుగురి అదృశ్యం..

ABN , Publish Date - Apr 05 , 2025 | 08:40 AM

Missing Case: బోయిన్‌పల్లిలో ఆరుగురు కుటుంబ సభ్యులు కనపడకుండా పోవడం సంచలనంగా మారింది. వీరి మిస్సింగ్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యుల అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారి కోసం వెతుకుతున్నారు.

 Missing Case: సికింద్రాబాద్‌లో మిస్టరీగా ఒకే కుటుంబంలో ఆరుగురి అదృశ్యం..
Family Members Missing

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. న్యూ బోయిన్‌పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్‌, ఉమా దంపతులుగా తెలుస్తోంది. వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్యా అనే మరో కుటుంబ సభ్యురాలు కూడా కనిపించకుండా పోయారు. స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా మహేష్ పనిచేస్తున్నాడు.


గురువారం మహేష్ ఇంటికి సంధ్యా వెళ్లింది. సంధ్యాతో పాటు అదే రోజు బయటకు వెళ్లి మహేష్, భార్య పిల్లలు తిరిగిరాలేదు. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులకు మహేష్ బావ భిక్షపతి ఫిర్యాదు చేశాడు. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు ఆటో బుక్‌ చేసుకుని బోయిన్‌పల్లి నుంచి ఎంజీబీఎస్‌ స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరి మిస్సింగ్ సికింద్రాబాద్‌లో మిస్టరీగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: నకిలీ ఫొటోలు, వీడియోలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

Hyderabad: హైదరాబాద్‌ మెట్రోకు యూరోపియన్‌ వ్లాగర్‌ ఫిదా..

Fatty Liver: ఫ్యాటీ లివర్‌పై సర్కారు ఫోకస్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 08:48 AM