Mahesh Kumar Goud: కేటీఆర్‌పై పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:40 PM
Mahesh Kumar Goud: రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలు నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో కేటీఆర్ అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేసీఆర్ ఫ్యామిలీపై సీబీఐతో విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్, ఏప్రిల్ 11: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదో ఒక రోజు అరెస్ట్ కాక తప్పదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. హెచ్‌సీయూ అంశానికి కేటీఆర్ అరెస్ట్‌కు లింక్ పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడే మాటలకు చిన్న పిల్లలు సైతం నవ్వుకుంటున్నారన్నారు. పదేండ్లలో భూ దోపిడి చర్చకు సిద్ధమా?.. దమ్ము ధైర్యముంటే చర్చకు రండంటూ కేటీఆర్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు.
కరప్షన్‌కి కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమని ఆయన అభివర్ణించారు. లిక్కర్ స్కాం చేసింది కూడా కేసీఆర్ కుటుంబమేనని ఆయన గుర్తు చేశారు. అడ్డమైన వాళ్లు వచ్చి మాట్లాడుతున్నారని.. ఈ మాటలను నమ్మకండంటూ తెలంగాణ ప్రజలకు పీసీసీ చీఫ్ సూచించారు. కేటీఆర్ ఇంతగా దిగజారుతాడా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంపై సీబీఐతో విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. చాలా తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ధనం దోపిడి చేసింది కేసీఆర్ కుటుంబమేనని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు.
బిల్లీ రావుతో కేటీఆర్ ఒప్పందం చేసుకున్నాడని పేర్కొన్నారు. కేటీఆర్ గుంటూరులో ఏం చదువు నేర్చుకున్నాడో అర్థం కావడం లేదన్నారు. సగం సగం తెలుసుకొని రాజకీయ లబ్ది కోసం కేటీఆర్ మాట్లాడుతారంటూ ఎద్దేవా చేశారు. బీసీ కుల గణన వల్ల బీఆర్ఎస్ పార్టీలో వణుకు పుట్టిందన్నారు. బీఆర్ఎస్ పదేండ్లలో ఎన్ని వేల ఎకరాలను కొల్లగొట్టారో తెలియదా? అంటూ ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు.
రైతులు బాగు పడుతుంటే కేటీఆర్‌కి కడుపు నొప్పి వస్తోందని ఎద్దేవా చేశారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు చేయించి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. తెలంగాణకి ఉద్యోగాలు రాకూడదా? అంటూ బీఆర్ఎస్ నేతలు సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ దోపిడీని భరించ లేకనే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించారన్నారు. గత పదేండ్లలో జరిగిన భూ దోపిడీపై విచారణ జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బిఅర్ఎస్ నేతలు కడుపు మంటతో మాట్లాడ్తున్నారని మండిపడ్డారు. కానీ దానిని తాను వివాదం చేయదలుచుకో లేదన్నారు. ప్రతిపక్షాలు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాయన్నారు. కడుపు నిండా భోజనం పెట్టె కార్యక్రమం తాను ప్రారంభిచడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సన్నబియ్యంపై ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుందని చెప్పారు. ఎవరో ఒకరు విమర్శలు చేసి దాని సాంటిటిని దెబ్బతియ్యవద్దంటూ ప్రతిపక్షాలకు ఆయన హితవు పలికారు. మంచి ఫైన్ రైస్ బీఅర్ఎస్ కానీ.. బీజేపీ కానీ గతంలో ఇచ్చారా? అంటూ ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
అలాంటి వారి కోసం మాట్లాడం కరెక్టు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2.8 కోట్ల జనాభాకు దొడ్డు బియ్యం ఇస్తూ.. రూ. 10 వేల కోట్లు గతం లో ఖర్చు చేశారని గుర్తు చేశారు. 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వడానికి రూ. 13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. గతంలో నాణ్యత సరిగా లేక పోవడంతో.. ఎవరు తినేవారు కాదన్నారు. అయితే తమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పు తీసుకున్నామని పేర్కొన్నారు. గతాని కంటే ఖర్చు అధికంగా చేస్తున్నాం.. నిరుపేదల కడుపు నింపడానికి ఖర్చు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.
సన్నబియ్యం పథకాన్ని జనాల్లోకి లోతుగా తీసుకు వెళ్ళాలని నాయకులను కోరినట్లు చెప్పారు. కాళేశ్వరం కూలిన తర్వాత రికార్డ్ స్థాయిలో పంట 66.7 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పడిందని వివరించారు. 10 ఏండ్ల బిఆర్ఎస్ హయాంలో పండని పంట కాంగ్రెస్ హయాంలో పండిందని గుర్తు చేశారు. రైతు పక్ష పాత ప్రభుత్వం అని చెప్పాడనికి పండిన పంట శాతమే నిదర్శనమన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో కమిటెడ్‌గా ఉన్నామని.. సరైన ధర కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కనీస మద్దతు ధరకి, అలాగే బోనస్‌కు రూ. కోట్ల నగదు ఖర్చు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదాహరణగా వివరించారు.
For Telangana News And Telugu News