Share News

Ice Cream: ఫ్లేవర్‌ గుర్తిస్తే రూ. 3లక్షలు మీవే..

ABN , Publish Date - Apr 09 , 2025 | 09:25 AM

మీరు తినే ఐస్‌క్రీమ్‌ ఏ ఫ్లేవరో చెబితే రూ. 3లక్షలు మీవే.. అంటూ ఓ కార్యక్రమం ఈనెల 27న ఐస్‌క్రీమ్‌ ప్రియుల ముందుకు రాబోతోంది. అయితే.. ఈ పోటీలో పాల్గొనే వారి కళ్లకు గంతలు కడతారు. కేవలం దాని రుచి ఆధారంగా అది ఏ ఫ్లేవరో చెప్పాలి అంటున్నారు నిర్వాహకులు. ఇక వివరాల్లోకి వెళితే..

Ice Cream: ఫ్లేవర్‌ గుర్తిస్తే రూ. 3లక్షలు మీవే..

- గంతలు కట్టుకుని ప్రయత్నించండి

- ప్రథమ బహుమతిగా రూ.లక్ష

- 27న ఐస్‌క్రీమ్‌ టేస్టింగ్‌ చాలెంజ్‌

హైదరాబాద్: కళ్లకు గంతలు కట్టుకుని మీరు ఐస్‌క్రీమ్‌(Ice Cream) ఫ్లేవర్‌ను గుర్తించగలరా.. అయితే ఈ చాలెంజ్‌ మీకోసమే.. గుర్తిస్తే రూ.3లక్షలు మీవే అంటూ ఓ కార్యక్రమం ఈనెల 27న ఐస్‌క్రీమ్‌ ప్రియుల ముందుకు రాబోతోంది. ది గ్రేట్‌ ఇండియన్‌ ఐస్‌క్రీమ్‌ టేస్టింగ్‌ చాలెంజ్‌ 3వ ఎడిషన్‌ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఎర్రమంజిల్‌ గలేరియా మాల్‌లో హీరోయిన్‌ కావ్య కల్యాణ్‌రామ్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ శ్వేతావర్మ, నటుడు సమీర్‌ తదితరులు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పెద్దప్లానే వేశారుగా.. రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా


ఈ పోటీలో మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50వేలు, 3వ బహుమతిగా రూ.25 వేలు అందిస్తారు. అలాగే మరో 25 మంది విన్నర్లను ఎంపిక చేసి రూ.5వేల చొప్పున కన్సోలేషన్‌ బహుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలు ఎర్రమంజిల్‌ మెట్రోస్టేషన్‌ పక్కన ఉన్న ప్రీమియా మాల్‌లో ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.


city5.jpg

ఈ సందర్భంగా పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వారు కళ్లకు గంతలు కట్టుకుని ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్‌ చెప్పే ప్రయత్నం చేశారు. వివరాల కోసం 8008574747 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐస్‌బర్గ్‌ ఐస్‌క్రీమ్స్‌ సీఈవో సుహాస్‌ బి. శెట్టి, ఓ తెలుగుచానెల్‌ ఎండి ఎం.రాజ్‌గోపాల్‌, డాక్టర్‌ జె.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2025 | 09:25 AM