Share News

కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటు తప్పదు

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:59 PM

కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటు తప్పదని, ప్రజలు కాంగ్రెస్‌పై విశ్వాసం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపురం శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం శారదానగర్‌లోని శిశుమం దిర్‌లో జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు.

కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటు తప్పదు

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీలో తిరుగుబాటు తప్పదని, ప్రజలు కాంగ్రెస్‌పై విశ్వాసం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపురం శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం శారదానగర్‌లోని శిశుమం దిర్‌లో జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి పాలన పట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అసంతృప్తితో ఉన్నారని, ఎప్పుడు రేవంత్‌రెడ్డిని గద్దె దించేది తెలియదన్నారు. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ప్రగతి పథంలో ముందుకు దూసుకెళు తుందన్నారు. కార్యకర్తలు గ్రామం లేదా బస్తీల్లో కనీసం 8గంటలు సం దర్శించి ఆసుపత్రులు, పాఠశాలలు, దేవాలయాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలన్నారు. ఈనెల 6 నుంచి బీజేపీ ఆవిర్భావ వేడుకలను పండుగలా నిర్వహించుకోవాలని పిలుపుని చ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. గుజ్జుల రామకృష్ణారెడ్డి, రఘునాథరావు, కందుల సంధ్యారాణి, బల్మూరి వనిత, చల్లా నారాయణరెడ్డి, వెంకన్న, కోమళ్ల మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 11:59 PM