Share News

సంక్షేమమే లక్ష్యంగా పథకాల అమలు..

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:45 AM

దేశంలోనే తెలంగాణలో రేషన్‌ దుకా ణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయడం ప్రథమమని, ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తోందని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

సంక్షేమమే లక్ష్యంగా పథకాల అమలు..

సిరిసిల్ల, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే తెలంగాణలో రేషన్‌ దుకా ణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయడం ప్రథమమని, ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తోందని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్ల లోని కొత్త బస్టాండ్‌ వద్ద రేషన్‌ దుకాణంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ మహేష్‌ బీ గీతేలతో కలిసి ఆయన లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మొదటిసారిగా లబ్ధిదారులకు ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో 17,263 రేషన్‌ దుకాణాల్లో 2.91లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. ప్రతి లబ్ధిదారుడు సన్నబియ్యంను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. దాదాపు 60 వేల ఉద్యోగా లను ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేస్తున్నామని అన్నారు. మహిళామణులను కోటీశ్వరు లుగా చేయాలని ఇందిర మహిళాశక్తి కింద వివిధ యూనిట్లు ప్రారంభిం చామని తెలిపారు. సోలార్‌ యూనిట్లు, మహిళ సంఘాలకు బస్సులు అందిస్తున్నామని అన్నారు. సన్నరకం ధాన్యం పండించే రైతులకు క్వింటా లుకు రూ.500 బోనస్‌ అందజేస్తున్నామని అన్నారు. ఆర్టీసీకి నూతన బస్సులు అందిస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. జిల్లాలోని నేత కార్మికులకు భరోసా కల్పి స్తూ గత బకాయిలను విడుదల చేసిందని అన్నారు. యారన్‌ బ్యాంక్‌ను ప్రారంభించిం దని నేత కార్మికుల సమస్యలను పరిష్క రిస్తూ ముందుకు వెళుతుందని అన్నారు. 20వేల కోట్ల రూపాయల రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని, త్వరలో పింఛన్‌ పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 345 రేషన్‌ దుకా ణాల ద్వారా 1.70 లోల లబ్ధిదారులకు 3,275 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడు తూ సన్నబియ్యం పంపిణీలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, ఆర్డీవో రాధాబాయి, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌ప ర్సన్‌ వెల్ముల స్వరూప, పౌర సరఫరాల అధికారి వసంతక్ష్మి, మేనేజర్‌ రజి త తదిదరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:45 AM