Share News

స్కానింగ్‌ సెంటర్ల తనిఖీ

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:10 AM

జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ మంగళవారం స్పెషల్‌ టీంతో కలిసి స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కానింగ్‌ సెంటర్‌లో నిబంధనలు అమలవుతున్న తీరును పరిశీలించారు.

స్కానింగ్‌ సెంటర్ల తనిఖీ
స్కానింగ్‌ మిషన్‌ను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ మంగళవారం స్పెషల్‌ టీంతో కలిసి స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కానింగ్‌ సెంటర్‌లో నిబంధనలు అమలవుతున్న తీరును పరిశీలించారు. గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్దారణ చట్టం-1994, రూల్స్‌-1996 అమలు గురించి తెలుసుకున్నారు. గర్భస్థ శిశవుగా ఉన్నపుడు లింగ నిర్ధారణ చేస్తే పరీక్షలు చేసిన వారికి, చేయించిన వారికి చట్ట ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని, అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరగుతుందని తెలిపే బోర్డులు ప్రదర్శిస్తున్నారా లేదా అని పరిశీలించారు. స్కానింగ్‌ సెంటర్లలో కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ పర్టిఫికెట్‌, ధరల పట్టిక, సరైన రికార్డుల నిర్వహణ ఉండాలని, ప్రతినెలా జరిగే స్కానింగ్‌ విరాలను జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారికి పంపిస్తున్న తీరు, లింగ నిర్ధారణ, పరీక్షలు చట్ట రీత్యా నేరమని, పుట్టబోయే ఆడ మగ, అని చెప్పకూడదని తెలిపే బోర్డులు ప్రదర్శించాలని సూచించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ స్కానింగ్‌ సెంటర్లు, ఫెర్టిలిటీ కేంద్రాల తనిఖీ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీపీఎన్‌డీటీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సనాజవేరియా, ఏఎస్‌ఐ విజయమణి, డెమో రాజగోపాల్‌, డీఈవో రమేశ్‌, సూపర్‌వైజర్‌ సయ్యద్‌సాబీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:10 AM