Share News

కులగణన రీ సర్వేలో కేటీఆర్‌ పాల్గొనాలి..

ABN , Publish Date - Feb 19 , 2025 | 01:01 AM

విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, కులగణనలో పాల్గొన లేదన్న అపవాద ఉందని, ఆ అపవా దును తొలగించుకునేందుకు కులగణన రీ సర్వేలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ పాల్గొన్నాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షహన్మండ్లు అన్నారు.

కులగణన రీ సర్వేలో కేటీఆర్‌ పాల్గొనాలి..

సిరిసిల్ల టౌన్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, కులగణనలో పాల్గొన లేదన్న అపవాద ఉందని, ఆ అపవా దును తొలగించుకునేందుకు కులగణన రీ సర్వేలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ పాల్గొన్నాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షహన్మండ్లు అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం బీసీ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణనలో తప్పులు తడకలు ఉన్నాయని, తూతూ మంత్రంగా సర్వే చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్‌ ప్రస్తావించారని అన్నారు. బీసీలు దీని ద్వారా నష్టపోతున్నారని అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం తీసుకురావాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారని, బీసీల పక్షాన మాట్లాడినందుకు కేటీఆర్‌కు బీసీల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. కులగణన రీ సర్వేలో కేటీఆర్‌ పాల్గొని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. గతంలో కులగణనలో పేర్లు నమోదు చేసుకోని వారు ప్రభుత్వం ఈనెల 28 వరకు చేపడు తున్న రీ సర్వేలో పాల్గొని కులగణనను విజయవంతం చేయాలని అన్నారు. కులగణన సరిగా చేయలేదని బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల డిమాండ్‌ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి భేషజాలకు పోకుండా రీ సర్వేను ఆదేశించడం గొప్ప విషయం అన్నా రు. రీ సర్వేను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టి చట్టం చేస్తే స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమ లుకు అవకాశం ఉంటుందన్నారు. అసెంబ్లీలో బీసీ చట్టం తీసుకురా వడానికి బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం పార్టీలు మద్దతును ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పంపించే బీసీ బిల్లును పార్లమెంట్‌ సమావేశాలలో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి బిల్లుకు చట్టబద్ధత కల్పించవలసిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన ఉందన్నారు. బీసీ బిల్లుకు చట్టసభలో మద్దతునిచ్చే పార్టీలకు భవిష్యత్తులో తమ సంఘం మద్దతు ఉంటుందని సహకరించని పార్టీ లను వ్యతిరేకిస్తూ ఎండగడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్‌, పట్టణ అధ్య క్షుడు కమలాకర్‌, జిల్లా నాయకులు రాములు, తిరపతి, ప్రసాద్‌, రవి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 19 , 2025 | 01:02 AM