సీఎం, స్పీకర్, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:07 AM
బీఆర్‌ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని, తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను శాసన సభలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి అవమానించారని గ్రం థాలయం జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ అన్నారు.

సిరిసిల్ల టౌన్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని, తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను శాసన సభలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి అవమానించారని గ్రం థాలయం జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు దహనం చేయడాన్ని ఖండిస్తూ శనివారం సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్న చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్య క్షుడు సూర దేవరాజు,చేనేత సెల్ జిల్లా అధ్య క్షుడు గోనె ఎల్లప్ప, మార్కెట్ కమిటి డైరెక్టర్లు ఎండీ ఖాజా, వెంకటేశం, కాసర్ల రాజు, మాజీ కౌన్సిలర్లు యెల్లె లక్ష్మినారాయణ, కత్తెర దేవదాస్, రాగుల జగన్, నాయకులు రంగ కిషన్, గుండ్ల పెల్లి గౌతమ్, యాదగిరి పాల్గొన్నారు.