ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలి
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:08 AM
తెలం గాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీ ఆమో దించాలని ఎంఎస్‌పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఇంజం వెంకట స్వామి డిమాండ్ చేశారు.

సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి15 (ఆంధ్రజ్యోతి) : తెలం గాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీ ఆమో దించాలని ఎంఎస్‌పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఇంజం వెంకట స్వామి డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ జాతీయ వ్యవ స్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలమేరకు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ఎమ్మార్పీఎస్, ఎం ఎస్‌పీ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరహా ర దీక్షలు శనివారంతో 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరానికి ముఖ్య అతిఽథిగా హాజరైన ఎంఎస్‌పీ రాష్ట్ర కో-అర్డినేటర్ వెంకటస్వామి మాట్లాడారు. కార్యక్ర మంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్, జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి, జిల్లా కో-కన్వీనర్ సామనపెల్లి రాకేష్, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు సామనపెల్లి బాలయ్య, సిరిసిల్ట పట్టణ అధ్యక్షుడు కత్తెరపాక సంతోష్, నాయకులు మంగళి చంద్రమౌళి, అవునూరి లచ్చన్న, సిరిసిల్ల రాజనర్సు. ఎడ్లరవి, నేదూరి బాబు, మునిగే శంకర్, సామల్ల ప్రతాప్, గసికంటి కళ్యాణ్, అవునూరి ఎల్లం, అందె చంద్రయ్య, మొర్రాయిపల్లి భూమరాజు తదితరులు పాల్గొన్నారు.