bus బస్‌షెల్టర్ ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:43 PM
పట్టణంలోని గాంధీనగర్ సమాధుల వద్ద ప్రయాణికులు బస్సుల కోసం ఎండలో నిల్చోని అవస్థలు పడుతున్నారు. రైల్వేస్టేషన నుంచి ప్రయాణికులు దిగి బత్తలపల్లి వైపు వెళ్లే ప్రయాణికులు కదిరి గేటుకు వేళ్లే సమాధుల వద్ద బస్టాప్ వద్ద బస్సు లు, ఆటోలను ఎక్కుతారు.

ధర్మవరంరూరల్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గాంధీనగర్ సమాధుల వద్ద ప్రయాణికులు బస్సుల కోసం ఎండలో నిల్చోని అవస్థలు పడుతున్నారు. రైల్వేస్టేషన నుంచి ప్రయాణికులు దిగి బత్తలపల్లి వైపు వెళ్లే ప్రయాణికులు కదిరి గేటుకు వేళ్లే సమాధుల వద్ద బస్టాప్ వద్ద బస్సు లు, ఆటోలను ఎక్కుతారు. అయితే ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా కనీసం కూర్చోవడానికి చెట్టు నీడ కూడా లేదు. గ్రామీణప్రాంత ప్రజలు రైలుకు వచ్చి రైల్వేస్టేషన నుంచి తమ గ్రామాలకు వెళ్లాలంటే సమాధుల వద్ద క్రాసింగ్ రహదారిలో ఇలా నిలబడి పడిగాపులు కాయాల్సిందే. ఎండకా లం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతంలో బస్‌షెల్టర్ ఏర్పాటు చేయాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.