లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:11 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం కాలనీలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ప్రారంభించారు. 18వ డివి జన్ గంగిరెద్దుల(మహారాజుల) వారు నివ సించే గుడిసెలను ఎమ్మెల్యే సందర్శించారు.

యైుటింక్లయిన్‌కాలనీ, ఏప్రిల్ 5 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం కాలనీలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ప్రారంభించారు. 18వ డివి జన్ గంగిరెద్దుల(మహారాజుల) వారు నివ సించే గుడిసెలను ఎమ్మెల్యే సందర్శించారు. సన్నబియ్యంతో చేసిన వంటలను వారితో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. అనం తరం కాలనీలోని ఐదు డివిజన్‌లకు చెం దిన తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు 17వ డివిజన్ రేషన్ షాప్‌లో ఎమ్మెల్యే సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రజల సంక్షేమానికి నిబద్ధతతో పని చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. బియ్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా పేద ప్రజ లపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొ న్నారు. పేదలకు అండగా నిలబడడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్పొరే టర్లు సాగంటి శంకర్, శంకర్‌నాయక్, కాం గ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్, నాయకులు రాజిరెడ్డి, జక్కుల దామో దర్‌రావు, అనుము రాములు, దేవనపల్లి చక్రపాణి, తిరుపతిరెడ్డి, వై తిరుపతి, మేరు గు రాజేశం, సునీత సాంబయ్య, సారయ్య నాయక్, అవినాష్ పాల్గొన్నారు.