గురుకులం ఎదుట తల్లిదండ్రుల పడిగాపులు
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:13 AM
ఉగాది పండుగ పూట పిల్ల లను కలిసేందుకు తల్లిదండ్రులు పడిగాపులు కాశారు. స్థానిక రమేష్ నగర్‌లోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల(గుంజపడుగు) వద్ద ఆదివారం పిల్లలను కలిసేందుకు తల్లిదండ్రులు వచ్చారు.

కోల్‌సిటీటౌన్, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగ పూట పిల్ల లను కలిసేందుకు తల్లిదండ్రులు పడిగాపులు కాశారు. స్థానిక రమేష్ నగర్‌లోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల(గుంజపడుగు) వద్ద ఆదివారం పిల్లలను కలిసేందుకు తల్లిదండ్రులు వచ్చారు. పం డుగకు పిల్లలను ఇంటికి పంపించే పరిస్థితి లేకపోవడంతో ఉగాది పండుగ పచ్చడి, బక్షాలు పిండివంటలు తీసుకొని పిల్లలకు తినిపిం చేందుకు తల్లిదండ్రులకు నిబంధనలు అడ్డువచ్చాయి. గురుకుల పాఠ శాల బయట ఉన్న తల్లిదండ్రులు, వసతిగృహంలో ఉన్న పిల్లలు నిరీ క్షిస్తూ కంటతడిపెట్టారు.
వసతి గృహంలోని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ను ఫోన్‌లో సంప్రదించినా నిబంధనలున్నాయని, అనుమతించ వద్దని చెప్పడంతో గంటల తరబడి గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రులు వేచి ఉన్నారు. చివరికి పిల్లలను కలిసేందుకు అనుమతించడంతో సంతోషంగా వారిని కలిసి అప్యాయంగా పిండివంటలు తినిపించారు.