Share News

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:19 AM

రాజ్యాంగ పరిర క్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జైబాపు, జైభీం, జైసంవిధాన్‌ నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఐతరాజుపల్లి నుంచి భూపతిపూర్‌ వరకు సోమవారం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాద యాత్ర నిర్వహించారు.

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ పరిర క్షణ అందరి బాధ్యత అని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జైబాపు, జైభీం, జైసంవిధాన్‌ నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఐతరాజుపల్లి నుంచి భూపతిపూర్‌ వరకు సోమవారం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాద యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్‌ అం బేద్కర్‌ రచించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్నాయన్నారు. నల్లధనం వెలికి తీసి జన్‌ దన్‌ ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని ఎన్నికల ముం దు హామీ ఇచ్చి నయా పైసా వేయ లేదని పేర్కొన్నారు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడు పుకోవడమే బీజేపీ విధానమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధిహామీ పథకాన్ని తీసుకువచ్చి ఎంతోమంది పేదల కడు పులు నింపుతున్నదని అన్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌, కార్య క్రమ నియోజకవర్గ ఇంఛార్జి పటేల్‌ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాహుల్‌గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టాలని నిర్దేశించారని చెప్పారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్‌ రావు, తిరుపతి రెడ్డి, గండు సంజీవ్‌, మాజీ జడ్పీటీసీ సారయ్య గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు చిలుక సతీష్‌, సామా రాజేశ్వర్‌ రెడ్డి, మూల ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:19 AM