సత్యం కుటుంబానికి అండగా ఉంటాం
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:08 AM
ప్రైవేట్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు బాలసాని సత్యం కుటుంబానికి అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలీఠాకూర్ చెప్పారు. శనివారం సత్యం సంస్మరణ సభ నిర్వహించారు. మనాలీఠాకూర్, వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, ట్రస్మా నాయకులు సత్యం చిత్రపటానికి నివాళులర్పించారు.

కోల్‌సిటీటౌన్, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు బాలసాని సత్యం కుటుంబానికి అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలీఠాకూర్ చెప్పారు. శనివారం సత్యం సంస్మరణ సభ నిర్వహించారు. మనాలీఠాకూర్, వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, ట్రస్మా నాయకులు సత్యం చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం 30 ఏళ్ళుగా ఉపాధ్యాయ వృత్తిలో సత్యం అందించిన సేవలను కొనియాడారు. విద్యాభారతి హైస్కూల్, శ్రీరామవిద్యానికేతన్ పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయుడిగా సత్యం ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ధారన్నారు.
పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం
సత్యం కుటుంబాన్ని ఆదుకునేందుకు విద్యార్థులు, పూర్వవిద్యార్థులు విరాళాలు సేకరించి గురుభక్తిని చాటుకున్నారు. సేకరించిన రూ.3లక్షల 20వేల ఫిక్స్‌డ్ డిపాజిట్, ట్రస్మా తరపున రూ.41వేల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను సత్యం భార్యకు మనాలీఠాకూర్ చేతులమీదుగా అందజేశారు. ట్రస్మా రాష్ట్ర కన్వీనర్ అరుకాల రాంచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బందారపు యాదగిరిగౌడ్, పరుపాటి అంజారెడ్డి, కంది రవీందర్‌రెడ్డి, అదర్ సండే సమ్మారావు, చందుపట్ల తిరుపతిరెడ్డి, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, జీల రవి, డి హరీష్, నాగరాజు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.