కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలి
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:05 AM
సమస్యల పరిష్కారానికి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని బిల్డింగ్ అండ్ కన్సస్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్‌గౌడ్ పిలుపునిచ్చారు.

భగత్‌నగర్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారానికి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని బిల్డింగ్ అండ్ కన్సస్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో యూనియన్ జిల్లా మూడో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌గౌడ్ మాట్లాడుతూ సంక్షేమ చట్టంలో నిబంధనలు దేశ వ్యాప్తంగా ఒకే పద్ధతిలో ఉండాలన్నారు. 2018 నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ బోర్డుకు పాలకవర్గం లేకుండా కార్మిక అధికారులతో నడిపించిందన్నారు. సంక్షేమ బోర్డు నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించుకుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా బోర్డుకు పాలక వర్గాన్ని నియమించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. తక్షణమే కార్మిక సంఘాల నుంచి ఎంపిక చేసిన సభ్యులతో బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు గన్నారం రమేష్ మాట్లాడుతూ మార్చి 28న పార్లమెంట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలన్నారు. దేశంలో ఎక్కడైనా వర్తించేలా గుర్తింపు కార్డులు జారీచేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య, రాష్ట్ర నాయకులు కడారి రాములు, జి రాజు, పిట్టల శ్రీనివాస్, కన్నెం సదానందం, అలిశెట్టి చంద్రయ్య, పిట్టల రమ, పిట్టల రాజేశ్వరి, అల్లపు లావణ్య, పున్న మహేశ్వరి, కచ్చకాయల తిరుమల, పులికోట రవి పాల్గొన్నారు.