Share News

Maoists surrender: తెలంగాణలో భారీగా లొంగిపోతున్న మావోయిస్టులు

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:11 PM

Maoists surrender: మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఈసారి ఎన్‌కౌంటర్‌ పరంగా కాదు.. భారీగా మావోయిస్టుల పోలీసుల ఎదుట లొంగిపోవడమే ఇందుకు కారణం.

Maoists surrender: తెలంగాణలో భారీగా లొంగిపోతున్న మావోయిస్టులు
Maoists surrender

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 5: భద్రాద్రి మునుగు జిల్లాలో భారీగా మావోయిస్టులు (Maoist) లొంగిపోయారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు జిల్లా పోలీసుల సమక్షంలో సరెండర్ అయ్యారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు కలిపి మొత్తం 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి తక్షణ సహాయం కింద 25 వేల రూపాయలను అందించారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా 86 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి (IG Chandrashekhar Reddy) తెలిపారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన వారని.. కొత్తగూడెం పోలీసు అధికారులు వారితో ఫ్రెండ్లీగా మాట్లాడి వారిని ఒప్పించారని, నమ్మకం ఏర్పడ్డాకే వీరంతా లొంగిపోయారని తెలిపారు. ప్రభుత్వం తరపున సహాయం కూడా అందించినట్లు ఐజీ చంద్రశేఖర్ తెలిపారు.


కాగా.. ఇంత భారీగా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవడం మావోలకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) చేపట్టిన ఆపరేషన్ చేయూతకు ఆకర్షితులై జనజీవన స్రవంతిలో కలవాలని లొంగిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఛత్తీగఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరుతో వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు పార్టీలకు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వచ్చే మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీలను పూర్తిగా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit shah) ప్రకటించినట్లుగా మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టుల మృత్యువాత పడ్డారు.

Pithapuram Tension: పోటాపోటీ నినాదాలు.. పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత


ఈ ఎన్‌కౌంటర్ల దెబ్బకు అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈరోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా కీలకమైన ప్రాంతాల్లో పనిచేసిన వారే అని పోలీసులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున మావోల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలకు గట్టి దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మొత్తం వార్ జోన్ నడుస్తోంది. వరుస ఎన్‌కౌంటర్లతో అగ్రనేతలను కోల్పోతున్నారు మావోలు. కేంద్ర కమిటీల్లో ఉన్న వారంతా వయోభారంతో ఉన్న పరిస్థితి. ఇలాంటి సందర్భంగా కేంద్ర బలగాలతో పోరాడే శక్తి లేక, తమ విలువైన జీవితాలను కుటుంబాలతో కలపాలని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూతలో భాగంగా పోలీసుల ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.


ఇవి కూడా చదవండి

YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో

Kishan Reddy On MIM: ఎంఐఎం కోటలు బద్దలు కొడతాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:11 PM