Share News

Sri Rama Pattabhishekam: అంగరంగ వైభవంగా కోదండరాముని పట్టాభిషేకం

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:45 PM

Sri Rama Pattabhishekam: భద్రాచలంలో శ్రీరామంద్రుడి పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు మిథులా స్టేడియానికి తరలివచ్చారు.

Sri Rama Pattabhishekam: అంగరంగ వైభవంగా కోదండరాముని పట్టాభిషేకం
Sri Rama Pattabhishekam

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 7: భద్రాచలంలో శ్రీరాముల వారి మహాపట్టాభిషేకం (Sri Rama Pattabhishekam) అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా కళ్యాణ మండపంలో సీతరామచంద్రుడికి అర్చకులు పట్టాభిషేకం నిర్వహించారు. నిన్న (ఆదివారం) భద్రాచాలంలో శ్రీసీతారాముల కళ్యాణం కన్నులపండుగా జరిగింది. ప్రతీఏటా స్వాముల వారి కళ్యాణం అనంతరం మహాపట్టాభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Telangana Governor Jishnu Dev Verma) హాజరయ్యారు. శ్రీ రామ మహా పట్టాభిషేకంలో రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు గవర్నర్.


పట్టాభిషేకంలో భాగంగా రాములవారికి పాదుకలను సమర్పించారు అర్చకులు. రాజదండం, రాజ ముద్రిక, రాజ ఖడ్గం, ఛత్రం, చామరలు, రామదాసు పచ్చల పతకాన్ని శ్రీరాముడికి అలంకరించారు. ఆపై ఆ రామయ్యకు కిరీటాన్ని ధరించారు. ఆ తరువాత వివిధ నదుల తీర్థాలతో సీతారామాచంద్ర భగవనాడుకి అభిషేకం క్రతువును నిర్వహించారు అర్చకులు. మహా పట్టాభిషేక మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆ రామయ్య పట్టాభిషేకాన్ని వీక్షించి పునీతులయ్యారు. ఈరోజు రాత్రికి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.


ఘనంగా పట్టాభిషేకం: మంత్రి తుమ్మల

Thummala.jpg

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి మహా పట్టాభిషేకం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రం, దేశం పాడి పంటలతో సుసంపన్నంగా ఉండాలని కోదండ రాముడుని వేడుకున్నానని తెలిపారు. రాముల వారి కళ్యాణం పట్టాభిషేకం ఘనంగా నిర్వహించిన అధికారులకు, విచ్చేసిన భక్తులకు, మీడియా ప్రతినిధులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Illegal Mining Case: అక్రమ మైనింగ్ కేసు.. విచారణకు వచ్చిన ప్రభాకర్ రెడ్డి


కాగా.. రాముల వారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు ఈరోజు (సోమవారం) ఉదయం సారపాకకు చేరుకున్న గవర్నర్‌కు హెలిప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల స్వాగతం పలికారు. ఆపై మిథిలా కళ్యాణ మండపానికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ మర్యాదలతో అర్చకులు, మంత్రి తుమ్మల స్వాగతం పలికారు.


ఇవి కూడా చదవండి

Medchal Crime News: రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం... చివరకు

HCU Land Dispute: హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 01:50 PM