CPI MLA: ఎమ్మెల్యే కూనంనేనికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
ABN, Publish Date - Jan 15 , 2025 | 08:30 PM
Kunamneni Sambasivarao: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు తెలంగాణ హైకోర్టులోనే కాదు.. సుప్రీంకోర్టులో సైతం గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
న్యూఢిల్లీ, జనవరి 15: కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తనపై దాఖలు అయిన పిటిషన్‌ను కొట్టి వేయాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కూనంనేని సాంబశివరావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్ కేసులో వాదనలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలంటూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరాకు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 ఏడాది చివరిలో జరిగాయి.
ఆ సమయంలో ఫారం 26 ఎన్నికల అఫిడవిట్‌లో సమగ్ర వివరాలు వెల్లడించలేదంటూ కొత్తగూడెంకు చెందిన నందూలాల్ అగర్వాల్ ఆరోపించారుర. ఆ క్రమంలో కూనంనేని ఎన్నికను సవాల్ చేస్తూ.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిట్నరింగ్ అధికారికి సమర్పించిన ఫారం 26 అఫిడవిట్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన కూనంనేని సాంబశివరావు.. తన భార్య పేరు పేర్కొనలేదన్నారు. అలాగే లైసెన్స్‌డ్ నోటరీతో అఫిడవిట్ రూపొందించలేదంటూ తన దాఖలు చేసిన పిటిషన్‌లో నందూలాల్ అగర్వాల్ స్పష్టం చేశారు.
అయితే నందూలాల్ వేసిన పిటిషన్‌ను క్వాష్ చేయాలంటూ తొలుత తెలంగాణ హైకోర్టును ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆశ్రయించారు. కానీ నందులాల్ పిటిషన్‌ను క్వాస్ చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో కూనంనేని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ సైతం సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కూనంనేని సాంబశివరావుకు గట్టి షాక్ తగిలినట్లు అయింది.
Also Read: మరణించిన 20 ఏళ్ల తర్వాత కొడుకు కలలోకొచ్చిన తండ్రి.. సమాధి తవ్విన కుటుంబ సభ్యులు.. ఊహించని షాక్..
Also Read: మళ్లీ నోటీసులు.. విచారణకు రాలేనన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
Also Read: ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Also Read: పోలీస్ శాఖలో గ్యాంగ్‌స్టర్.. చివరకు భలే దొరికాడు
Also Read: మీ ఆవేదన, ఆక్రోశం దేని కోసం
Also Read: మరికొద్ది రోజుల్లో బడ్జెట్.. వీటిని గమనించండి
For Telangana News And Telugu News
Updated Date - Jan 15 , 2025 | 08:30 PM