Share News

Hyderabad: కేపీహెచ్‌బీ ప్లాట్ల వేలం నేడు

ABN , Publish Date - Jan 24 , 2025 | 03:35 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత అభివృద్ధి చెందిన కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ(కేపీహెచ్‌బీ) పరిధిలో మిగిలిన ప్లాట్ల(స్థలాలు)ను శుక్రవారం వేలం వేయనున్నామని గృహ నిర్మాణ శాఖ కమిషనర్‌, బోర్డు వైస్‌ చైర్మన్‌ వి.పి.గౌతమ్‌ తెలిపారు.

Hyderabad: కేపీహెచ్‌బీ ప్లాట్ల వేలం నేడు

  • గృహ నిర్మాణ శాఖ కమిషనర్‌ ప్రకటన

  • అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపు

హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత అభివృద్ధి చెందిన కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ(కేపీహెచ్‌బీ) పరిధిలో మిగిలిన ప్లాట్ల(స్థలాలు)ను శుక్రవారం వేలం వేయనున్నామని గృహ నిర్మాణ శాఖ కమిషనర్‌, బోర్డు వైస్‌ చైర్మన్‌ వి.పి.గౌతమ్‌ తెలిపారు. గృహ నిర్మాణ పథకాల అమలుకు వీలు కాని చిన్నచిన్న విస్తీర్ణం కలిగిన ప్లాట్లను, గృహాల మధ్య అక్కడక్కడ మిగిలిపోయిన ప్లాట్లనే వేలం వేస్తున్నామని ప్రకటించారు. వేలంలో ఉంచిన ప్లాట్లు అత్యంత విలువైన, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


కాగా, హైదరాబాద్‌ చుట్టుపక్కల హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్న 700 ఎకరాల భూములు అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని గౌతమ్‌ వెల్లడించారు. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10.71లక్షల దరఖాస్తులు వచ్చాయని గృహ నిర్మాణ సంస్థ గురువారం ప్రకటించింది. ఇప్పటిదాకా 7.50 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని గృహ నిర్మాణ సంస్థ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం

ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు

ఏపీతో మూడు రాష్ట్రాలతో పోటీ

మనసులో మాట చెప్పిన రఘురామ..

Updated Date - Jan 24 , 2025 | 03:35 AM