నాయకత్వ లక్షణాన్ని పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:23 PM
ఉపాధ్యాయులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని డీఈవో యాదయ్య అన్నారు. మంచిర్యాల ప ట్టణంలోని గర్మిళ్ల పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణాతరగతులకు ఆయ న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా విద్యాధికారి యాదయ్య
మంచిర్యాల క్రైం, ఏప్రిల్3(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా కృషి చేయాలని డీఈవో యాదయ్య అన్నారు. మంచిర్యాల ప ట్టణంలోని గర్మిళ్ల పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణాతరగతులకు ఆయ న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రమోషన్ పొందిన పాఠశాలల ప్రధానోపాద్యాయులకు, ప్రాథమిక పాఠశాలల ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాద్యాయులకు శిక్షణాతరగతులను నిర్వ హించారు. వారి నాయకత్వ లక్షణాలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని, నాయకత్వ అభివృద్ధిపై అనేక అంశాలపై చర్చించా రు. పాఠశాలలను చక్కగా నడుపాలని విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిం చే విధంగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్షణ కో-ఆర్డినేటర్ చౌదరి, సత్యనారాయణ మూర్తి, పాఠశాల ప్రధానోపాద్యాయులు కరుణాకర్ పాల్గొన్నారు.