Ugadi: విశ్వావసు.. విజయోస్తు.. నేడు ఉగాది
ABN, Publish Date - Mar 30 , 2025 | 06:54 AM
కొత్త చిగుళ్లు తొడిగిన కొమ్మలు.. కోకిలల కుహు..కుహూ రాగాలు.. మామిడి పిందెలు ఉగాది శోభకు ప్రతిరూపాలు. కొత్త బట్టలు, భక్ష్యాల విందులు, షడ్రుచుల ఆరగింపు, పంచాంగ పఠనం, కవితా సమ్మేళనాలు.. ఇవన్నీ కొత్త సంవత్సరాది సందళ్లు. చైత్ర శుద్ధ పాడ్యమి సందర్భంగా ఆదివారం వచ్చే ఈ కొత్త తెలుగు సంవత్సరాది (శ్రీవిశ్వావసు సంవత్సరం)కి ఘనంగా స్వాగతం పలికేందుకు నగరం సిద్ధమైంది.

- శోభాయమానంగా ఆలయాలు
- పంచాంగ పఠనం, పచ్చడి పంపిణీకి ఏర్పాట్లు
- కొనుగోలుదారులతో రద్దీగా మార్కెట్లు
- నేడు ఉగాది
హైదరాబాద్ సిటీ: వసంత రుతువు ప్రారంభం, తెలుగు సంవత్సరాది ఆరంభం ఒక్కటే. అదే ఉగాది. కొత్త చిగుళ్లు తొడిగిన కొమ్మలు.. కోకిలల కుహు..కుహూ రాగాలు.. మామిడి పిందెలు ఉగాది శోభకు ప్రతిరూపాలు. కొత్త బట్టలు, భక్ష్యాల విందులు, షడ్రుచుల ఆరగింపు, పంచాంగ పఠనం, కవితా సమ్మేళనాలు.. ఇవన్నీ కొత్త సంవత్సరాది సందళ్లు. చైత్ర శుద్ధ పాడ్యమి సందర్భంగా ఆదివారం వచ్చే ఈ కొత్త తెలుగు సంవత్సరాది (శ్రీవిశ్వావసు సంవత్సరం)కి ఘనంగా స్వాగతం పలికేందుకు నగరం సిద్ధమైంది.
ఈ వార్తను కూడా చదవండి: జవహర్‌నగర్ పరిధిలో ఇళ్ల కూల్చివేత
మామిడి తోరణాలు, పూల అలంకరణలతో ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. పంచాంగ పఠనాలు, పచ్చళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. నగరంలోని పలు మార్కెట్లు పండగ సామగ్రి కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పండగ నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు పండగల్లో అతి ముఖ్యమైనది ఉగాది(Ugadi). ప్రస్తుతం జరుపుకొనే ఉగాదికి చేస్తున్న హడావిడి, హంగు, ఆర్భాటాలు చూస్తూనే ఉన్నాం. అయితే, వందేళ్ల కిందటి ఉగాది అంటే ఆధునిక భావాల పరివ్యాప్తికి ఆలవాలంగా ఉండేది. తెలంగాణ సాంస్కృతికోద్యమ తొలిపొద్దు భాగ్యరెడ్డి వర్మ అందుకు ఆద్యుడు.
ఈ వార్తలు కూడా చదవండి:
టెన్త్ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం
జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
Read Latest Telangana News and National News
Updated Date - Mar 30 , 2025 | 07:19 AM