దేశాభివృద్ధిలో చెరగని ముద్ర
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:35 PM
బాబు జగ్జీవన్‌రాం దేశ రాజకీయాల్లో చరగని ముద్ర వేశారని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు అన్నారు.

అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు
కలెక్టరేట్‌లో ఘనంగా జగ్జీవన్‌రాం జయంతి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : బాబు జగ్జీవన్‌రాం దేశ రాజకీయాల్లో చరగని ముద్ర వేశారని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు అన్నారు. జాతీయ ఉద్యమంలో పాల్గొన్న ఆయన స్వాతంత్య్రం అనంతరం కేంద్ర మంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చి దేశాభివృద్ధికి కృషి చేశారన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జగ్జీవన్‌రాం జయంతికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. కలెక్టరేట్ కార్యాలయ పరిపాలన అధికారి శంకర్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు.
గొప్ప సంఘ సంస్కర్త
బాబు జగ్జీవన్‌రాం గొప్ప సంఘ సంస్కర్త అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ చౌరస్తాలోని బాబు జగ్జీవన్‌రాం కాంస్య విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు.
నేటికి గ్రామాల్లో కులవివక్షత
పాలమూరు : నేటికీ గ్రామాల్లో కులవివక్షత, అంటరానితనం కొనసాగటం బాధాకరమని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాణిక్యంరాజు, కుర్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అదే విధంగా టీఎన్‌జీవోస్, ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల వేదిక ఆధ్వర్యంలో, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, గజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు విజయకుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.