పురాతన బావులను పునరుద్ధరించాలి
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:35 PM
రాజోలిలో ని కోటవీధిలో ఉన్న పురాతన బురుజులు, బా వులను పునరుద్ధరించాలని, దేవాలయ భూము లను అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం కాపా డాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామ చంద్రారెడ్డి అన్నారు.

బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి
రాజోలి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): రాజోలిలో ని కోటవీధిలో ఉన్న పురాతన బురుజులు, బా వులను పునరుద్ధరించాలని, దేవాలయ భూము లను అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం కాపా డాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామ చంద్రారెడ్డి అన్నారు. రాజోలి మండల అధ్యక్షు డు శశికుమార్ ఆధ్వర్యంలో ఆయన పార్టీ నా యకులతో కలిసి సోమవారం పురాతన బురు జులు, బావులను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాజోలి సంస్థానాన్ని పాలించిన రాజు నల్ల సోమనాద్రి (పెద్ద సోమ భూపాలుడు) పాలించి కోటకు భారీ ఎత్తున ప్రహరీ బురుజులు నిర్మించి ప్రవేశ తలుపులు ఏర్పాటు చేయించారన్నారు. అందులో శ్రీ వైకుం ఠ నారాయణ స్వామి ఆలయాన్ని కూడా రాజు నిర్మించాడని ‘‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం రెండ వ సంపుటి’’ అనే గ్రంథంలో ఉన్న చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని అన్నారు. అలాంటి పురాతన బురుజులు, బావులు నేడు కనుమరు గు అవుతన్నాయని, వాటిని పునరుద్ధరించాలని, సంరక్షించాలని, వాటిని పర్యాటక ప్రదేశాలుగా మార్చాలని అన్నారు. శ్రీ వైకుంఠ నారాయణ స్వామి ఆలయాభివృద్ధి కోసం ఇనాంగా ఇచ్చిన 250 ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతు న్నాయని, వాటిని సంరక్షించి, ఆలయ అభివృ ద్ధికి తోడ్పడాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శశికుమార్, నాయకులు ఈసీ ఆంజనేయులు, గట్టురాము, రాజేశ్, గో వింద రాజులు, వీరేశ్, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.