జంతుజాలం, మొక్కల పరిరక్షణ కీలకం
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:15 PM
పర్యావరణ పరి రక్షణ, వాతావరణ సమతుల్యత లతో పాటు మానవ మనుగడ కు జంతువులు, మొక్కల పరిర క్షణ అత్యంత కీలకమని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అ న్నారు.

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్
గద్వాల టౌన్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరి రక్షణ, వాతావరణ సమతుల్యత లతో పాటు మానవ మనుగడ కు జంతువులు, మొక్కల పరిర క్షణ అత్యంత కీలకమని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అ న్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎదురవుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం పర్యావ రణ పరిరక్షణతోనే సాధ్యమన్నారు. స్థానిక మ హారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో బుధవారం వృక్షశాస్త్రం విభాగం ఆధ్వ ర్యంలో ‘అన్ విల్లింగ్ ది లైఫ్ సైన్స్ ప్రాస్పెక్టీవ్‌స్ అండ్ ప్లాంట్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్’ అనే అంశంపై ఒక్కరోజు జాతీయ సెమినార్ నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే, భూమిపై మొక్కలు, చెట్లు, జంతువులను సంర క్షించుకోవడం కనీస బాధ్యతగా ప్రతీఒక్కరు గుర్తించాలన్నారు. వాటిని నిర్లక్ష్యం చేస్తే భవి ష్యత్‌లో గాలి, నీరు, ఆక్సిజన్‌ను కొనుగోలు చేసే దుస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని హె చ్చరించారు. సెమినార్‌లో బొటానికల్ లైఫ్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి స్వర్ణ లత మాట్లాడుతూ భూమిని సంరక్షించుకునే అవసరాన్ని వివరించారు. హైదరాబాద్‌కు చెంది న బయోజనిక్ ప్రాడక్ట్ కో ఫౌండర్ డాక్టర్ సుధీర్‌కుమార్ మాట్లాడుతూ మొక్కల కాండం, వేర్లు, పత్రాల ఉపయోగాల గురించి తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్‌బాషా, సెమినార్‌లలో భాగస్వాములయ్యే విద్యార్థులు లైఫ్ సైన్స్‌కు సంబంధించి సాగుతున్న పరి శోధనలపై విస్తృత అవగాహన పెంచుకోవాల న్నారు. డాక్టర్ చంద్రశేఖర్, లైఫ్ సైన్స్ విద్యార్థు లకు భవిష్యత్‌లో లభించే ఉద్యోగ అవకాశాలు, పీహెచ్‌డీ, రీసెర్స్ అంశాలు వివరిస్తూ దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలను వివరించారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న బీఎం సంతోష్ మెడిషనల్ ప్లాంట్ల వల్ల ఉపయో గాలు, అలోపతి, ఆయుర్వేద మెడిషన్లలో ప్లాంట్ల వినియోగం, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో వాటి ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరిం చారు. కార్యక్రమంలో ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపా ల్ డాక్టర్ మీనాక్షి, జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ జం బు రామన్‌గౌడ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. చంద్రమోహన్, అధ్యాపకులు, ఉన్నారు.