Share News

రైతులకు అన్యాయం చేయొద్దు

ABN , Publish Date - Jan 20 , 2025 | 11:46 PM

వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులకు అన్యాయం చేయొద్దని ప్రజా ఐక్య వేదిక ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి అన్నారు.

రైతులకు అన్యాయం చేయొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న రాఘవాచారి, వేదికపై నాయకులు సీతారాంరెడ్డి, ఇంద్రారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, నాగయ్య, తిరుపతయ్య తదితరులు

- పొలాలు ముంపునకు గురి కాకుండా చూడాలి

- ప్రజా ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి

- ఉమామహేశ్వర రిజర్వాయర్‌ నిర్మాణంపై రైతులతో సమావేశం

బల్మూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతులకు అన్యాయం చేయొద్దని ప్రజా ఐక్య వేదిక ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి అన్నారు. రైతులు సాగు చేసు కుంటున్న పొలాల్లో ఉమామహేశ్వర రిజర్వా యర్‌ నిర్మిస్తామంటూ ఇంజనీర్లతో సర్వే చేయించడాన్ని ఆయన తప్పు పట్టారు. నాగ ర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండల కేంద్రం లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం రైతుల భూముల్లో రిజర్వాయర్‌ను నిర్మిస్తామనడం సరి కాదన్నారు. రసూల్‌ చెరువు, కొచ్చెరువు, రామగిరి ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమిలో నిర్మించాలని డిమాండ్‌ చేశారు. 2.67 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మిస్తామని చెప్తున్న నాయకులు, ఇంజనీర్లు ప్రజల భూములు ముంపునకు గురి కాకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. మైలారం గుట్ట మీద జరుగుతున్న మైనిం గ్‌పై గ్రామస్థులతో మాట్లాడేందుకు వస్తున్న ప్రొఫెసర్‌ హరగోపాల్‌, గడ్డం లక్ష్మణ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు. మైలారం గ్రామస్థుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో ఉమా మహేశ్వర రిజర్వాయర్‌ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సీతారాంరెడ్డి, ఇంద్రారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, నాగయ్య, తిరుపతయ్య, బాలస్వామి తదితరులున్నారు.

Updated Date - Jan 20 , 2025 | 11:46 PM