Share News

లబ్ధిదారుల ఎంపికకు పోషణ ట్రయల్‌ యాప్‌

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:39 PM

అం గన్‌వాడీ ద్వారా అందించే పోషణ పదార్థాలకు పోషణ ట్రయల్‌ యాప్‌తో లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్లు అంగన్‌వాడీ టీచర్లు తెలిపారు.

లబ్ధిదారుల ఎంపికకు పోషణ ట్రయల్‌ యాప్‌

వీపనగండ్ల, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : అం గన్‌వాడీ ద్వారా అందించే పోషణ పదార్థాలకు పోషణ ట్రయల్‌ యాప్‌తో లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్లు అంగన్‌వాడీ టీచర్లు తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని అంగన్‌వాడీ టీ చర్లు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు అంగన్‌వాడీకి వచ్చే చిన్నారుల తల్లిదండ్రులకు ఈ యాప్‌పై అవగాహన కల్పించారు. యాప్‌ ద్వారా లబ్ధిదారులు తమ పేర్లను ఇంటి వద్ద ఆ న్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానంపై ఇం టింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. అ ర్హులైన ప్రతీ ఒక్కరు ఆన్‌లైన్‌లో నమోదు చేసు కోవాలని లేకుంటే పోషణ పదార్థాలు అందవని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు సుగుణబాయ్‌, మహేశ్వరి, సువర్ణ, కమల, చె ల్లెమ్మ, కృష్ణమ్మ, పారిజాత, చంద్రకళ, మాధవి, పలుస లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 11:39 PM