Share News

తాగునీటి సమస్యను పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:18 PM

మక్తల్‌ మండలం ఉప్పర్‌పల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు మంగళవారం గ్రామ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.

తాగునీటి సమస్యను పరిష్కరించాలి
ఉప్పర్‌పల్లి గ్రామ ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న స్థానికులు

- ఉప్పర్‌పల్లిలో గ్రామస్థుల ధర్నా

- మిషన్‌ భగీరథ అధికారుల హామీతో విరమణ

మక్తల్‌రూరల్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): మక్తల్‌ మండలం ఉప్పర్‌పల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు మంగళవారం గ్రామ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. గ్రామంలో కొద్ది రోజుల నుంచి నీటి ఎద్దడి ఏర్పడిందని వాపోయారు. సోమ వారం రాత్రి మోటార్‌ కాలిపోవడంతో మిషన్‌ భగీరథ నీరు సరిపోవడం లేదని, వెంటనే అన్ని వార్డుల్లో నీటి సమస్యను పరిష్కరించాలని డి మాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న మిషన్‌ భగీరథ అధికారులు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఫోన్‌లో హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ధర్నా విరమించారు.

Updated Date - Apr 01 , 2025 | 11:18 PM