నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:04 PM
నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని ఏఐసీసీ సెక్రెటరీ సంపత్‌కుమార్ అన్నారు.

ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్
ఉట్కూర్‌లో సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ
అలంపూరు మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అలం పూరు నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని ఏఐసీసీ సెక్రెటరీ సంపత్‌కుమార్ అన్నారు. మండలంలోని ఉ ట్కూరులో ఆదివారం సీసీరోడ్డు నిర్మాణానికి ఆ యన భూమిపూజ చేశారు. అనంతరం గ్రామం లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. సంతోష్‌నగర్‌కాలనీలో మిషన్ భగీ రథ, అండర్ డ్రైనేజీ వల్ల ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలను గురించి పట్టణ కాంగ్రెస్ పార్టీ యూత్ అఽధ్యక్షుడు నరసింహ వినతిపత్రం అం దజేశారు. కార్యక్రమంలో తెలంగాణ టెలికాం బోర్డుమెంబర్ ఇస్మాయిల్, మార్కెట్‌యార్డు చైర్మ న్ దొడ్డప్ప, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కొంకల నాగరాజు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నీలి శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు అడ్డాకుల రాము, ఉండవల్లి గోపాల్, రుక్మానందరెడ్డి, సాత ర్ల జయచంద్రరెడ్డి, దేవేంద్ర, శ్రీను, ఉట్కూరు లిఫ్టు చైర్మన్ నర్సన్‌గౌడ్, పట్టణ యూత్ అధ్యక్షు డు నరసింహ పాల్గొన్నారు.
గంజిపేట రాములుకు పరామర్శ
గద్వాల క్రైం : కొన్నిరోజులుగా తలకు గా యం కావడం జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న రామును ఏఐసీసీ కార్యదర్శి, చత్తీస్‌గఢ్ ఇన్‌చార్జి డాక్టర్ సంపత్‌కుమార్ ఆది వారం పరామర్శించారు. ఇటీవలే జరిగిన దాడిలో రాము తలకు గాయమైన విషయాన్ని తెలుసుకున్న సంపత్‌కుమార్ బాధితున్ని పరామర్శించి ఆరోగ్యంపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. కార్యక్రమంలో పీసీసీ మెంబర్ గంజిపేట శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, నాయకులు దినేష్, బైని పరశురాం తదితరులు ఉన్నారు.