పేదల కడుపు నింపేందుకే.. సన్న బియ్యం పంపిణీ
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:21 PM
పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేపట్టిందని క లెక్టర్ విజయేందిర బోయి అన్నారు.

- కలెక్టర్ విజయేందిర బోయి
- లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన జిల్లా అధికారులు
- సన్న బియ్యం సద్వినియోగం చేసుకోవాలని సూచన
మహబూబ్‌నగర్ రూరల్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేపట్టిందని క లెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళ వారం మహబూబ్‌నగర్ మండలంలోని కోడూ రులోని ఎస్సీ కాలనీలో రేషన్‌కార్డు లబ్ధిదారుడు హెచ్.గోపాల్, సత్తమ్మ ఇంట్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ మోహన్‌రావ్ ప్రభుత్వం ఉచితంగా అం దించిన సన్న బియ్యంతో తయారు చేసిన భోజ నం చేశారు. లబ్ధిదారులను నాణ్యత ఎలా ఉంద ని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడు తూ.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యా న్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నా రు. బాగా చదివి, ఉన్నత స్థాయికి ఎదిగి తల్లి దండ్రులకు గుర్తింపు తీసుకురావాలని వారి పిల్ల లను సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, డీఎం రవి నాయ క్ తదితరులు పాల్గొన్నారు.
పునరావాస పనులు వేగవంతం చేయాలి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్: ఉదండాపూర్ రిజర్వాయర్ పునరావాస పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశిం చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందిరంలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమావేశమై మా ట్లాడారు. రిజర్వాయర్ కింద వల్లూరు, ఉదండా పూర్, తుమ్మలకుంట తండా, రేగడిపట్టితండా, చిన్నగుట్టతండా, శామగడ్డ తండా, ఒంటిగుడిసె తండా, పోలేపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇళ్లు కోల్పోయి, అవార్డు అందుకున్న వారందరికీ పున రావసం కింద అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్వాసితులు దేవాలయానికి స్థలం కోరారని, సబ్‌స్టేషన్ స్థలాన్ని కేటాయిం చాలన్నా రు. సబ్‌స్టేషన్‌కు మరోచోటు చూడాలన్నారు.