Share News

Mahesh Goud: పదేళ్ల మీ పాలన.. ఏడాది మా పాలనపై చర్చకు సిద్ధమా?

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:34 AM

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, ఏడాది కాంగ్రెస్‌ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సవాల్‌ విసిరారు.

Mahesh Goud: పదేళ్ల మీ పాలన.. ఏడాది మా పాలనపై చర్చకు సిద్ధమా?

  • కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సవాల్‌

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన, ఏడాది కాంగ్రెస్‌ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ సవాల్‌ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పార్టీ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. దీనిపైనా తాను చర్చకు సిద్దమన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణలపైనా చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు కట్టిపెట్టి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని హితవు పలికారు. సీఎం రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గాడిద గుడ్డు వస్తుందని తెలిసే.. బీఆర్‌ఎస్‌ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 04:34 AM

News Hub