ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Etala: ఆకలి ఉన్న వారికే అధికారం రావాలి..

ABN, Publish Date - Jan 09 , 2025 | 08:27 AM

ఆకలి ఉన్నవారికే అధికారం రావాలని, ప్రజల ఆకలి సమస్యలు అర్థం చేసుకోవడమే నిజమైన అంబేడ్కర్‌ స్ఫూర్తి అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) అన్నారు. చైతన్యం, త్యాగాలు, ప్రజాస్వామ్యం లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. అధికారం కొనుక్కుంటే వచ్చేది కాదన్నారు.

- అధికారం కొనుక్కుంటే వచ్చేది కాదు

- ఎంపీ ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌ సిటీ: ఆకలి ఉన్నవారికే అధికారం రావాలని, ప్రజల ఆకలి సమస్యలు అర్థం చేసుకోవడమే నిజమైన అంబేడ్కర్‌ స్ఫూర్తి అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajgiri MP Etala Rajender) అన్నారు. చైతన్యం, త్యాగాలు, ప్రజాస్వామ్యం లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదన్నారు. అధికారం కొనుక్కుంటే వచ్చేది కాదన్నారు. ప్రజలను విస్మరించడం మంచిది కాదన్నారు. ఖైరతాబాద్‌(Khairatabad)లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్‌లో తెలంగాణ విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 2025- డైరీ, క్యాలెండర్‌ను ఈటల బుధవారం ఆవిష్కరించారు.

ఈ వార్తను కూడా చదవండి: సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పది నిమిషాలకో బస్సు


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టిజన్‌ నుంచి సీఎండీ వరకు ఇది నాది అనే సంకల్పంతో పని చేస్తేనే విద్యుత్‌ సంస్థలు ఈ స్థాయికి వచ్చాయన్నారు. బీసీలు వెనుకబడిన వారు కాదని, వెనక పడేయబడిన వారన్నారు. బీసీలు రాజకీయాల్లో ఎందుకు రాణించలేకపోతున్నారనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరముందన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అండగా ఉంటానన్నారు. సంఘం ఉంటే ఉద్యోగులకు ధైర్యం, గౌరవం అన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ.. మెరిట్‌ కమ్‌ సీనియారిటీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.


సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ సంస్థల్లో డైరెక్టర్లను వెంటనే నియమించాలని, వారి వయోపరిమితిని 65కు పెంచాలని కోరారు. ఏడాది క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చి ఇప్పటివరకు డైరెక్టర్లను నియమించకపోవడం బాధకరమన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బ్రహ్మేందర్‌, యాదగిరి, రాజేందర్‌, రవీందర్‌, అశోక్‌కుమార్‌, చంద్రుడు, విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2025 | 08:27 AM