Share News

ఈదురు గాలులతో పంటలకు నష్టం

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:41 AM

కోదాడ మండలంలో సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు మామిడి పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఈదురు గాలులతో పంటలకు నష్టం
ఈదురు గాలులకు కూలిన చెట్టు

కోదాడ రూరల్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : కోదాడ మండలంలో సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు మామిడి పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని కాపుగల్లు, రెడ్లకుంట, యర్రవరం, గణపవరం గ్రామాల్లో మామిడికాయలు నేలరాలాయి. కాపుగల్లు గ్రామంలో 200 ఎకరాల్లో మామిడిపంట కు నష్టం జరిగిందని రైతులు తెలిపారు. చెట్లు కూడా గాలులకు విరిగిపోయాయని రైతు మీగడ లింగయ్య తెలిపారు. తనకు ఏడు ఎకరాల్లో మామిడి తోట ఉందని, ఈదురుగాలులతో సగానికి పైగా కాయ రాలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుమలగిరిలో...

తిరుమలగిరి రూరల్‌ : తిరుమలగిరి మండలంలో అకాలవర్షంతో రాఘవపురం, జలాల్‌పు రం గ్రామాల మామిడి రైతులకు అపారనష్టం జరిగింది. సుమారు 30 ఎకరాల్లోని మామిడి తోటల్లోని కాయలు రాలడం వల్ల రూ.10 లక్షల నష్టం జరిగిందని మామిడి తోటల రైతుల దొంగ రి సోమయ్య, కేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, కిష్టునాయక్‌, బారాజు వెంకన్నలు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Apr 09 , 2025 | 12:41 AM