వైభవంగా హనుమాన్ విజయయాత్ర
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:22 AM
హనుమాన్ విజయయాత్ర శనివారం భువనగిరి లో వైభవంగా సాగింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో కాషాయ జెండాలు ప్రదర్శిస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతాకీ జై నినాదాలతో డీజే పాటలకు నృత్యాలు చేస్తూ హనుమాన్ భక్తులు హోరెత్తించారు.

హనుమాన్ చాలీసాతో హిందువులు ఏకం : కార్తీక్
భువనగిరి టౌన్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): హనుమాన్ విజయయాత్ర శనివారం భువనగిరి లో వైభవంగా సాగింది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో కాషాయ జెండాలు ప్రదర్శిస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతాకీ జై నినాదాలతో డీజే పాటలకు నృత్యాలు చేస్తూ హనుమాన్ భక్తులు హోరెత్తించారు. అడుగడుగునా పలు సంఘాలు, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో విజయయాత్రకు స్వాగతం పలుకుతూ మజ్జిగ, నీరు, పులహోర ప్యాకెట్లు అందజేశారు. కాషాయ జెండాలు, తోరణాలు, ప్లెక్సీల అలంకరణలు, విజయ యాత్ర జోష్‌తో జిల్లా కేంద్రంలో పండుగ సందడి నెలకొం ది. స్థానిక హెచ్‌బీకాలనీ సమీపంలో గురు నిలయంలోని పెరుమాళ్ల ఆలయంలో పూజల అనంతరం ప్రారంభమైన యాత్ర పట్టణ ప్రధాన వీధు ల గుండా సాగి అంజనాద్రి ఆలయంలో ముగిసిం ది. డీసీపీ అక్షాంశ్ యాదవ్, వీహెచ్‌పి, బజరంగ్‌దళ్ జిల్లా అధ్యక్షులు పోత్నక్ రాఘవేందర్, బింగి భరత్‌కుమార్, బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డ్డి, తంగెళ్లపల్లి రవికుమార్, మునిసిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ వైస్ చైర్మన్లు, నర్ల నర్సింగరావు, మాయ దశరథ, తదతరులు పూజలు చేసి జండా ఊపి యాత్రను ప్రారంభించారు.
హిందువులను ఏకం చేసే హనుమాన్ చాలీసా పారాయణం
ప్రతీ శనివారం ఆలయాల్లో చేసే హనుమాన్ చాలీసా పారాయణం హిందువులను ఏకం చేస్తుందని రామకథ ప్రముఖ్ అడికే కార్తీక్ అన్నారు. భువనగిరి హనుమాన్ విజయయాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ హిందుత్వంపై జరుగుతున్న పలు రకాల దాడులను యువత తిప్పి కొట్టాలన్నారు. దేశభద్రత, సమగ్రతకు ఏకైక మార్గం హిందువుల ఐక్యతేనన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, చందా మహేందర్‌గుప్తా, వీహెచ్‌పి జిల్లా వర్కిం గ్ ప్రెసిడెంట్ పోలా శ్రీనివా్‌సగుప్తా, కార్యదర్శి సుక్కల శ్రీశైలంయాదవ్, కోశాధికారి చామ రవీందర్, పట్టణ అధ్యక్షుడు కే సహదేవ్, లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ సాల్వేరు వేణు, సామాజిక సమరసత జిల్లా కన్వీనర్ కేమోజు మల్లిఖార్జునచారి, సనాతన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు డీఎన్ చారి, భువనగిరి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రత్నపురం శ్రీశైలం, నీలం రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.