తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:51 AM
వృద్ధాప్యంలో బాధపడుతున్న తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం బీబీనగర్ మండల కేంద్రంలో దాతల సహకారంతో రూ.40లక్షలతో నిర్మించిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం భవనాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
బీబీనగర్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): వృద్ధాప్యంలో బాధపడుతున్న తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం బీబీనగర్ మండల కేంద్రంలో దాతల సహకారంతో రూ.40లక్షలతో నిర్మించిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం భవనాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ వయోవృద్ధుల భద్రతకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చాయని, వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదన్నారు. పిల్లలు పట్టించుకోవడం లేదని చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారని, చర్యలు తీసుకునేలోపే మళ్లీ వచ్చి పిల్లలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం ఇష్టం లేదని, కన్నపేగు అడ్డొస్తుందని వృద్ధ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఇదే రక్తసంబంధం గొప్పతనమని చెప్పారు. రాష్ట్రంలో 40లక్షల మంది వయోవృద్ధులు ఉండగా, వారిలో మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు పెన్షన్‌దారులు ఉన్నారన్నారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా ఆస్పత్రులు వైద్య సేవలు నిలిపివేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ప్రతీ ఒక్కరికి రూ.10లక్షల ఇన్స్యూరెన్స్ సౌక ర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. వయోవృద్ధుల సంక్షేమ సంఘం తమ దృష్టికి తెచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘం అధ్యక్షుడు కాసుల సత్యనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్ భగత్, ఎంపీడీవో శ్రీనివా్‌సరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివా్‌సరెడ్డి, వయోవృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారావు, జిల్లా అధ్యక్షుడు పూర్ణచందర్‌రావు, నాయకులు ఆగమయ్య గౌడ్, లింగారెడ్డి, గోళి ప్రణీత, శ్యాంగౌడ్, నరేందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, మనోహర్ పాల్గొన్నారు.