Share News

రూ.1.18కోట్లతో ఊరచెరువుకు మరమ్మతు

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:44 AM

స్వగ్రామంలో ఊరచెరువుకు రూ. 1.18కోట్లతో మరమ్మతు పనులను చేపట్టామని శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు.

రూ.1.18కోట్లతో ఊరచెరువుకు మరమ్మతు
చెరువు మరమ్మతు పనులను ప్రారంభిస్తున్న శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి

చిట్యాలరూరల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): స్వగ్రామంలో ఊరచెరువుకు రూ. 1.18కోట్లతో మరమ్మతు పనులను చేపట్టామని శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని ఊరచెరువుకు మరమ్మతు పనులను ఆయన బుధవారం ప్రారంభించి, మాట్లాడారు. చెరువులో నీటిసామర్థ్యం పెంపునకు మరమ్మతు పనులు ఉపయోగపడతాయన్నారు. దీంతో భూగర్భజలాల మట్టం కూడా పెరుగుతుందన్నారు. గ్రామాలకు చెరువులు ఎంతో ముఖ్యమని వాటి ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. చెరువులో నీటి లభ్యత అధికంగా ఉంటే భూగర్భజలాల మట్టం పెరిగి వ్యవసాయానికి సాగు నీరందుతుందని, రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో గుడిపాటి లక్ష్మీనర్సింహ, కోనేటి యాదగిరి, వనమా వెంకటేశ్వర్లు, చెరుకు సైదులు, పోలగోని స్వామి, పల్లపు బుద్ధుడు, జనార్ధన, జన్నపాల శ్రీను, ఉయ్యాల నరేష్‌, బొడ్డు శ్రీను, మర్రి రమేష్‌, గుత్తా రవీందర్‌రెడ్డి, మర్రి శ్రీకాంత, గోపాల్‌, శ్రీను, వెంకన్న, శంకర్‌, నర్సింహ, మల్లయ్య, యాదయ్య, నవీన, నర్సింహ, రవి పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:44 AM