Share News

వడదెబ్బ.. జర జాగ్రత్త

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:52 AM

రోజురోజుకూపెరుగుతున్న ఎండలకు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ అశ్వినకుమార్‌ కోరారు.

వడదెబ్బ.. జర జాగ్రత్త

మునిపంపుల వైద్యాధికారి డాక్టర్‌ అశ్వినకుమార్‌

రోజురోజుకూపెరుగుతున్న ఎండలకు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ అశ్వినకుమార్‌ కోరారు. ఎండ వేడిమి పెరుగుతుండడంతో జ్వరం, తలనొప్పి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు ఆసుపత్రికి వస్తున్నారని, ప్రజలు బయటికి వెళ్లే సమయంలో తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఇలా సూచించారు.

గ్రామాల్లో రైతులు, ఉపాధి హామీ కూలీలు ఉదయం 11 గంటల లోపు పనులు ముగించుకోవాలి.

తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, తెల్ల రుమాలు ధరించాలి.

గర్భిణులు, బాలింతలు, 10సంవత్సరాల పిల్లలు, 60సంవత్సరాలు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

తరుచూ శుభ్రమైన నీటిని తాగాలి.

ఫ్రూట్‌ జ్యూస్‌, ద్రవశాతం ఎక్కువ ఉండే పుచ్చకాయ, బత్తాయి, సంత్రాలు, ద్రాక్ష ఎక్కువ పొటాషియం కలిగిన అరటి పండ్లు తీసుకోవాలి.

వీలైనంతవరకు టీ, కాఫీ, మద్యం, తీపి పదార్థాలు అధిక ప్రొటీన గల ఆహారం, ధూమపానం, కూల్‌డ్రింక్స్‌, సోడా, ఎక్కువ కారం, మసాలాలతో ఉన్న ఆహారం తీసుకోవద్దు.

రామన్నపేట, ఆంధ్రజ్యోతి.

Updated Date - Apr 10 , 2025 | 12:52 AM